అనుమానాస్పదస్థితిలో యువతి మృతి
Published on: Fri Aug 29, 2025 2:12PM
.webp)
అనుమానాస్పద స్థితిలో యువతి మరణించిన సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంలో జరిగింది. కాటారం జాతీయ రహదారి పక్కన కమలాపూర్ క్రాస్ సమీపంలోని అటవీ ప్రాంతంలో ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మరణించింది. మృతి చెందిన యువతిని ఒడితల గ్రామానికి చెందిన వర్షిణిగా గుర్తించారు. ఆమె మృతదేహం పక్కనే ఆధార్ కార్డు, నిమ్మకాయలు, కుంకుమ ఉన్నాయి.
వర్షిణి తండ్రి చనిపోయిన బాధతో ఈ నెల 3 న ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయింది. ఆమె కోసం తల్లి వెతికి జాడ తెలియకపోవడంతో చిట్యాల పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్నారు. ఈ క్రమంలో గురువారం కమలాపూర్ క్రాస్ అటవీ ప్రాంతంలో యువతి మృత దేహం ఉందన్న సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు, ఆధార్ కార్డు లో ఉన్న వివరాల ఆధారంగా యువతి చిట్యాల మండలానికి చెందిన వర్షిణిగా గుర్తించారు.


