ఆ ఎమ్మెల్యే నా ప్రియుడు

 

యువకుడు ప్రేమించి మోసం చేసాడని, యువతి అతని ఇంటిముందు బైఠాయించి ఆందోళన చేయడం అప్పుడప్పుడు చూస్తుంటాం.. కానీ, ఎమ్మెల్యే నా ప్రియుడు అంటూ ఒక మహిళ, ఎమ్మెల్యే ఇంటిముందు ఆందోళనకి దిగింది.. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని మైసూరులో జరిగింది.. బీజేపీ ఎమ్మెల్యే ఎస్ఏ రామదాస్ ఇంటికి ప్రేమకుమారి అనే ఓ మహిళ వచ్చింది.. 'రామదాస్ నా మాజీ ప్రియుడు, అతనే నా భర్త' నేను అతన్ని కలవాలంటూ ఆమె, ఎమ్మెల్యే వ్యక్తిగత సిబ్బందిని కోరింది.. వారు ఎమ్మెల్యే ఇంట్లో లేరని చెప్పడంతో ఆగ్రహించిన మహిళ, ఎమ్మెల్యే ఇంటిముందు ఆందోళన చేసింది.. అలానే ' నేను గొప్ప కుటుంబం నుండి వచ్చిన దాన్ని.. ఎమ్మెల్యేను ప్రేమిస్తున్నాను కాబట్టే గత అసెంబ్లీ ఎన్నికల్లో నేను పోటీ చేయలేదు.. బతికున్నంత కాలం రామదాస్ ని వదలను.. కానీ రామదాస్ నా ఫోన్ కూడా ఎత్తడం లేదు' అని ప్రేమకుమారి ఆరోపించింది.. ఇలా ఎమ్మెల్యే నా ప్రియుడంటూ ఓ మహిళ, ఎమ్మెల్యే ఇంటిముందే ఆందోళన చేయటంతో ఈ ఘటన సంచలనమైంది.. అయితే ప్రేమ కుమారి ఎమ్మెల్యే రామదాస్ కోసం ఆందోళన చేయడం ఇదే మొదటిసారి కాదని.. ఎప్పటినుండో ఎమ్మెల్యే ప్రేమకోసం పోరాడుతుందని తెలుస్తుంది.. కానీ ఎమ్మెల్యే సన్నిహితులు మాత్రం డబ్బులు గుంజేందుకే మహిళ ఎమ్మెల్యే మీద తప్పుడు ఆరోపణలు చేస్తుందంటూ మండిపడుతున్నారు.. చూద్దాం ఈ ప్రేమకుమారి ప్రేమకథ ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో.