TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సినిమా కోసం చీటింగ్

Published on: Wed Apr 22, 2015 4:18PM

 

సినిమా హీరోయిన్ అవ్వాలనుకుంది సురేఖ అనే ఓ యువతి. ఆ కలలతోనే వెండి తెరపై ఓ వెలుగు వెలిగిపోవాలని ఆశతో హైదరాబాద్ నగరానికి వచ్చింది. కాని అవకాశాలేమి రాలేదు. దీంతో తనే స్వయంగా సినిమా తీయాలనుకొంది. అందుకు డబ్బు కావాలి... దీనికోసం ఆమె, తన భర్త శ్రీనివాస్‌రావు ఇద్దరూ కలిసి పలువురికి టోకరా వేశారు. తమ వద్ద పెట్టుబడి పెడితే నెలకు 10 శాతం కమీషన్ ఇస్తానని చెప్పి 10 కోట్ల వరకు వసూలు చేశారు. దీంతో మోసపోయిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా వారిపై చీటింగ్ కేసు నమోదు చేశారు. భర్త శ్రీనివాస్‌రావుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సురేఖ పరారీలో ఉంది.