మొగుళ్ళు కాదు.. మృగాలు!
Published on: Sat Jun 21, 2014 4:13PM

ఆంధ్రప్రదేశ్లో మొగుళ్ళ రూపంలో వున్న రెండు మృగాలు బయటపడ్డాయి. అయితే ఈరెండు మృగాల్లో ఒక మృగం మరణించింది. అనంతపురం జిల్లా పూలకుర్తిలో ఒక భర్త తన భార్యను చంపి అనంతరం తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహాలే నేపథ్యం కారణంగానే ఆ వ్యక్తి తన భార్యని చంపి తాను ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు చెబుతున్నారు. అలాగే, తూర్పు గోదావరి గుమ్మలదొడ్డిలో కుటుంబ కలహాల నేపథ్యంలో ఒక వ్యక్తి భార్యపై యాసిడ్ పోశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.


