TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సీబీఎన్ కు అభినందనల వెల్లువ!

Published on: Wed Jun 12, 2024 6:06PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి పారిశ్రామిక వేత్తల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. దేశ విదేశాల నుంచి ఆయనను అభినందిస్తూ సామాజిక మాధ్యమంలో పోస్టులు పెడుతున్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహేంద్ర సోషల్ మీడియా వేదికగా నారా చంద్రబాబును అభినందించారు. ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నారా చంద్రబాబుకు  అభినందనలు అంటూ ఆయన తెలుగులో చేసిన వ్యాఖ్య వైరల్ అయ్యింది.  ఆనంద్ మహేంద్ర ట్వీట్ కు చంద్రబాబు ధన్యవాదాలు ఆనంద్ మహీంద్రాగారూ అంటూ సమాధానమిచ్చారు. 

 అమెరికా కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ కూడా చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి తాను కూడా హాజరయ్యాననీ,  ఇది తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని పేర్కొన్నారు.  

బ్రిటిష్ కాన్సుల్ జనరల్ గారెత్ విన్ ఓవెన్  కూడా చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు.  వీరే కాకుండా కేంద్ర మంత్రులు జైశంకర్ , కిషన్ రెడ్డి, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్, టాలీవుడ్ సంగీత దర్శకుడు దేవీశ్రీప్రసాద్ తదితరులు కూడా చంద్రబాబుకు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు.