TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అప్పుడలా.. ఇప్పుడిలా.!!

Published on: Wed Aug 1, 2018 10:36AM

వైఎస్ జగన్ ఏం మాట్లాడినా ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది.. మొన్నటికి మొన్న 'పవన్ కళ్యాణ్ కార్లను మార్చినట్టు భార్యలను మారుస్తున్నాడని' వ్యక్తిగత విషయాలు మాట్లాడి విమర్శల పాలైన జగన్.. అది మరువక ముందే కాపు రిజర్వేషన్స్ గురించి మాట్లాడి తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్నారు.

 

 

జగ్గంపేట సభలో మాట్లాడుతూ జగన్, 'నేను మాట ఇస్తే నిలబడతాను.. చెయ్యగలిగిందే చెబుతాను.. కొన్ని రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేనివి ఉంటాయి.. అటువంటిదే కాపు రిజర్వేషన్ల సమస్య.. మొత్తం కోటా 50 శాతం దాటొద్దని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.. అందువల్ల ఇది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేని అంశం.. ఇది నేను చెయ్యగలిగినది కాదు కాబట్టి, చెయ్యలేనని ఏమాత్రం మొహమాటం లేకుండా కాపు సోదరులకు చెబుతున్నాను' అని అన్నారు.. ఈ వ్యాఖ్యల పట్ల జగన్ మీద తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.. ప్రత్యేకహోదా కూడా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేని అంశమే కదా మరి దాని మీద ఎలా పోరాడుతున్నాం?.. కాపు రిజర్వేషన్స్ మీద ఇలా యూ టర్న్ తీసుకోవడం కరెక్ట్ కాదు అంటూ తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి.. దీంతో జగన్ మళ్ళీ ఆలోచనలో పడినట్టు ఉన్నారు.. తాజాగా పిఠాపురం సభలో జగన్ మాట్లాడుతూ కాపు రిజర్వేషన్స్ కు తాము ఎప్పుడూ అనుకూలమే అన్నారు.. 'కాపు రిజర్వేషన్లపై నేను యూటర్న్‌ తీసుకోలేదు.. ఆ అలవాటు మా ఇంటా వంటా లేదు.. కాపులపై మొదటి నుంచి మా వైఖరి ఒక్కటే.. బీసీలకు అన్యాయం జరగకుండా, బీసీల హక్కులు పూర్తిగా కాపాడుతూ కాపుల కోటాకు మద్దతు అన్నదే మా మాట' అన్నారు.. అయినా జగన్ మీద సోషల్ మీడియాలో విమర్శలు ఆగట్లేదు.. అప్పుడలా ఇప్పుడిలా అంటూ రెండు సభల్లో జగన్ మాట్లాడిన వీడియోస్ ని పోస్ట్ చేస్తున్నారు.