Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కేటీఆర్ అరెస్టు ఖాయమా?
posted on: Jun 16, 2025 10:37AM

ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావును అరెస్టు చేయనుందా? సోమవారం (జూన్ 16) ఏసీబీ విచారణకు హాజరయ్యేందుకు బయలుదేరుతూ కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఆ సందర్భంగా ఈ ఫార్ములా కేసులో తనను అరెస్టు చేస్తారని మీడియాతో చెప్పడం దానినే సూచిస్తోంది. తనను అరెస్టు చేసి జైలుకు పంపిస్తారని తెలుసన్న కేటీఆర్.. జైలుకు పోవడం తనకు కొత్తేమీ కాదన్నారు. గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో తాను పలు సార్లు జైలుకు వెళ్లిన సంగతిని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ఫార్ములా ఈ రేస్ కేసులో ఇన్ హౌస్ విచారణ కాదు.. దమ్ముంటే ప్రజల ముందు, బహిరంగంగా చర్చిద్దామని తాను సవాల్ చేశాననీ, అయితే ఆ సవాల్ ను స్వీకరించే ధైర్యం లేక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పారిపోయారనీ కేటీఆర్ వ్యాఖ్యానించారు. చట్టం అంటే తనకు గౌరవం ఉందనీ, రెండు సార్లు, మూడు సార్లూ కాదు.. 30 సార్లు పిలిచినా విచారణకు హాజరౌతామని అన్నారు.
తనను విచారణకు, కేసుల పేరుతో వేధించడం వారి రేవంత్ పైశాచిక ఆనందం పొందడానికేనని కేటీఆర్ అన్నారు. ఈ ఫార్ములా ఈరేస్ కేసులో తనను అరెస్టు చేస్తారని తనకు మందే తెలుసని చెప్పిన కేటీఆర్, రేవంత్ సర్కార్ హామీల అమలు వైఫల్యం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఫార్ములా ఈరేస్ కేసు అంటున్నారని ఆరోపించారు. ఏది ఏమైనా కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీలు అమలు చేసే వరకూ ప్రజల వైపు ఉండి నిలదీస్తూనే ఉంటానన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వకుండానే స్థానిక ఎన్నికలకు వెడుతున్నారనీ, బీసీలు అన్నీ గమనిస్తారని కేటీఆర్ పేర్కొన్నారు. నోటుకు ఓటు కేసులో రేవంత్ లై డిటెక్టర్ టెస్టుకు సిద్ధమా అని మరోసారి సవాల్ విసిరారు. మీడియా సమావేశం అనంతరం ఆయన ఏసీబీ విచారణకు వెళ్లారు.






