TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఆసియా గేమ్స్ బహిష్కరిస్తాం: రెజ్లర్ల హెచ్చరిక

Published on: Sat Jun 10, 2023 5:00PM

భారత బాక్సింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిష్ భూషణ్‌ సింగ్‌ను వెంటనే అరెస్టు చేయాలని రెజ్లర్లు డిమాండ్ చేశారు. గత కొంత కాలంగా బ్రిజ్ భూషణ్ కు వ్యతిరేకంగా   రెజ్లర్లు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే.

 బ్రిజ్ భూషణ్ సింగ్‌ను వెంటనే అరెస్ట్ చేయకుంటే త్వరలో జరగనున్న ఆసియా గేమ్స్‌లో పాల్గొనబోమని రెజ్లర్లు ప్రకటించారు.  ఇటీవల కేంద్ర క్రీడా శాఖమంత్రి అనురాగ్ ఠాకూర్‌తో చర్చలు జరిపిన రెజ్లర్లు కేంద్రం ముందు ఐదు డిమాండ్లు పెట్టిన విషయం తెలిసిందే.

ఈ అంశంపై ఈ నెల 15వ తేదీలోపు ఓ నిర్ణయం తీసుకుంటామని మంత్రి అనురాగ్ చెప్పారు. ఆ గడువు ఇంకా ముగియకుండానే రెజ్లర్లు షాకింగ్ నిర్ణయం ప్రకటించారు. బ్రిజ్ భూషన్ తమను లైంగిక వేధింపులకు గురి చేశాడని రెజ్లర్లు ఆరోపిస్తున్న సంగతి విదితమే.