TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తొలి బంతికే వికెట్.. ఐపీఎల్‌లో ఐదు సార్లు.. పేసర్ షమీ సంచలనం

Published on: Thu Apr 2, 2026 5:44PM

ఐపీఎల్ లో తొలి బంతికే వికెట్... ఒకసారి, రెండు సార్లు కాదు ఏకంగా అయిదు సార్లు తీసుకుని సంచలనం సృష్టించాడు టీమ్ ఇండియా పేసర్ మహ్మద్ షమి.  అయిదు మ్యాచుల్లో తొలి బంతికే  వికెట్ తీసిన ఏకైక బౌల‌ర్‌గా  అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

మంగళవారం (ఏప్రిల్ 1)  లఖ్‌నవూ సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో  తాను వేసిన తొలి బంతికే వికెట్ తీసుకున్న మహ్మద్ షమీ  ఐపీఎల్ లో ఈ ఘనత సాధించిన తొలి బౌలర్ గా రికార్డ్ సృష్టించాడు.  గతంలో ఏడుగురు బౌలర్లు తొలి బంతికే వికెట్ తీసిన ఘనత మూడు సార్లు సాధించారు. షమీలా ఐదు సార్లు ఈ ఘనత సాధించిన వారెవరూ ఇంత వరకూ లేరు.  

కాగా గ‌త సీజ‌న్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌కు ప్రాతినిథ్యం వ‌హించిన ష‌మీని లఖ్‌నవూ సూప‌ర్ జెయింట్స్ ట్రేడ్ చేసుకున్న సంగ‌తి తెలిసిందే. నిన్న జరిగిన లఖ్‌నవూ తొలి మ్యాచ్‌లో ష‌మీ త‌న మార్క్‌ను చూపించాడు. నాలుగు ఓవ‌ర్ల కోటాలో 28 ప‌రుగులిచ్చి ఒక వికెట్ ప‌డ‌గొట్టాడు. ష‌మీ 2013లో ఐపీఎల్‌లో అరంగ్రేటం చేశాడు. ఇప్పటి వ‌ర‌కు అత‌డు 121 మ్యాచ్‌లు ఆడి... 8.62 ఎకాన‌మీతో 134 వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఇందులో రెండు సార్లు నాలుగు వికెట్ల ప్రద‌ర్శన ఉంది.