TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఏసు పాలనలో రామ రాజ్యమా! జవదేకర్ కు కౌంటరివ్వని వైసీపీ

Published on: Wed Dec 29, 2021 6:26PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, రెండున్నరేళ్ళ పాలనపై, బీజేపీ మొదటిసారిగా నోరు విప్పింది. రెండున్నరేళ్ళలో మొదటి సారిగా, ‘ప్రజాగ్రహ’ సభ పేరిట విజయవాడలో ఏర్పటు చేసిన బహిరంగ సభలో, కేంద్ర మాజీ మంత్రి, పార్టీ సీనియర్ నాయకుడు ప్రకాష్ జవదేకర్, వైసీపీ అరాచక పాలనపై కొన్ని ఘాటైన విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేరు ప్రస్తావించలేదు కానీ, బెయిలు ఫై ఉన్న, నాయకులు (అంటే ఏ వన్, ఏ టూ) త్వరలోనే జైలుకు వెళతారని అన్నారు. అలాగే, సభలో ప్రసంగించిన ప్రతి ఒక్కరూ, వైసీపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి దుష్ట దుర్మార్గ పాలన గురించే మాట్లాడారు. ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని దుమ్మెత్తి పోశారు. 

నిజానికి,ఇదే తరహ విమర్శలు, పొరుగు రాష్ట్రం తెలంగాణ ప్రభుత్వం మీదనో, ఆ  రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పైనో చేసుంటే, స్వయంగా ముఖ్యమంత్రి బరిలో దిగే వారు, మాటకు మాట తూటకు తూటా అన్న విధంగా సమాధానం ఇచ్చేందుకు ఏ మాత్రం వెనకాడే వారే కాదు . కానీ, జవదేకర్ పరోక్షంగానే అయినా, ఏకంగా ముఖ్యమంత్రి జైలుకు వెళతారని, ఇంకా అనేక తీవ్ర ఆరోపణలు చేసినా, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పెదవి విప్పలేదు. పేర్ని నానీ, బొత్స సత్యనారయణ, ప్రభుత్వ సలహా దారు సజ్జల రామకృష్ణా రెడ్డి స్పందించినా బెయిలు, జైలు కామెంట్స్ జోలికి పోలేదు. 

బీజేపీ నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారని, చంద్రబాబు ఎజెండా అమలు చేస్తున్నారని మొక్కుబడి ఖండనలు చేశారు తప్పించి ఘాటుగా సమాధానం ఇచ్చే ప్రయత్నం కూడా చేయలేదు. అంటే,కేంద్ర ప్రభుత్వం అంటే జగన్ రెడ్డి ఎంతగా భయపడుతున్నారో, వేరే చెప్పనక్కరలేదు. ఈ నేపధ్యంలో ఏ తప్పు చేయకపొతే జగన్ రెడ్డి, సాయి రెడ్డి ఎందుకు నోటికి తాళాలు వేసుకున్నారని, పార్టీ నాయకులు, రాజకీయ విశ్లేషకులు కూడా ప్రశ్నిస్తున్నారు. అదలా ఉంటే, బీజేపీ విమర్శల ఫై సలహాదారు సజ్జల చేసినవ్యాఖ్యలు మరీ విడ్డూరంగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బీజేపీ నాయకులు తమ ప్రభుత్వంపై  నేతల ఆరోపణలు చేసిన ఆరోపణలు అనుచితమని అన్నారు. ఆ పార్టీ నేతల వ్యాఖ్యల వెనుక ఎవరో ఉన్నారనిపిస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. బీజేపీకి మతం తప్ప వేరే అంశం లేదంటూ విమర్శించారు. రాష్ట్రంలో ఇప్పుడు నడుస్తున్నది రామరాజ్యమే అంటూ సజ్జల, సంపూర్ణ స్వామి భక్తిని  ప్రదర్శించుకున్నారు. 

ముఖ్యంగా, వైసీపీ ప్రభుత్వ ప్రతినిధిగా మాట్లాడతూ సజ్జల రామకృష్ణా రెడ్డి, బీజేపీని మతతత్వ  పార్టీ అనడం గురుగింజ సామెతను గుర్తుకు తెస్తోందని, విశ్లేషకులు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రెండున్నరేళ్ళ పాలనలో 150కి పైగా హిందూ ఆలయాలపై దాడులు జరిగాయి. ప్రసిద్ధ దేవాలయాలలో విగ్రహాలు ద్వంసయ్యాయి. దేవిని రధాలు దగ్ధమయ్యాయి. మరోవంక క్రైస్తవ మత ప్రచారం, మత మార్పిడులు, ప్రభుత్వ ఖజాన్ నుంచి పాస్టార్లకు జీతాలు, ప్రజాధనంతో చర్చిల  నిర్మాణం జరుగుతోంది. ఇంకా చెప్పాలంటే  రాష్ట్రాన్ని క్రైస్తవ రాష్ట్రంగా చేసేందుకు క్రైస్తవ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి (కొంత మంది ఏసు రెడ్డి అంటారు) పాలనలో, జగన్ రెడ్డి ప్రోద్బలం, సహకారంతో క్రైస్తవ సంస్థలు  చేస్తున్న కుట్రపూరిత ప్రయత్నాలు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. అయినా సజ్జల బీజేపీని మత తత్వపార్టీ అంటున్నారు. ఇది అయితే ఆయన అజ్ఞానం కావాలి, కాదంటే నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు న్న తెంపరితనం అయినా కావాలని పరిశీలకులు అంటున్నారు. అన్నిటికంటే, చిత్రం, రాష్ట్రంలో ఇప్పుడు నడుస్తున్నది రామరాజ్యమే అంటూ ... రామ రాజ్యం నిర్వచానాన్నే మార్చి వేశారు.  ఏసు పాలనలో రామ రాజ్యం అనే కొత్త నిర్వచనాన్ని ఇచ్చారు.