TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సొంత పార్టీవారే మెచ్చని వ్యర్థ పథకాలెందుకు జగనన్నా!

Published on: Tue Jun 7, 2022 5:24PM

ప్రభుత్వాలు అమ‌లు చేసే ప‌థ‌కాలు న‌ష్టాలు తెచ్చిపెట్టేవి కాకుడ‌దు. తెలిసి తెలిసి అలాంటి ప్రాజెక్టుల మీద‌నే ప్రేమ‌పెంచుకోవ‌డం దురదృష్టం. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జగ‌న్ పాల‌న‌లో రెండు ప‌థ‌కాలు న‌ష్టాలు చేకూర్చేవి వున్నాయి. వాటి నియ‌మ నిబంధన‌లు మార్చాల‌ని, అపుడు ఎంతో కొంత ఉప‌యోగ‌ప‌డ‌తా య‌ని ఇప్ప‌టికే చాలామంది  సీఎం జ‌గ‌న్‌కు చెప్పి విసుగెత్తేరు. కానీ జ‌గ‌న్‌కు మంచి మాట‌లు ఎప్పుడు చెవికెక్కాలి?! త‌ప్పులు స‌రిదిద్దుకోమ‌ని చెబితే చిన్న‌చూపు చూడ్డం త‌ప్ప త‌న త‌ప్పు తెలుసుకునే నైజం ఆయ‌న‌కు లేనే లేదు.  

విష‌య‌మేమంటే, జ‌ల‌క‌ళ‌, వైఎస్ ఆర్ యంత్ర ప‌థ‌కం అనేవాటిపై పెట్టే సొమ్ము చిల్లిపైసా కూడా తిరిగి రాదు. వాటివ‌ల్ల ప్ర‌యోజ‌నం లేద‌ని స‌ల‌హాలిస్తూనే వున్నారు. వాస్తవానికి జలకళ కింద ప్రతి జిల్లాలో రైతు లకు ఉచితంగా బోర్లు వేయాల్సి ఉంది. వీటికి విద్యుత్ కనెక్షన్లు కూడా ఇవ్వాలి.  ఆ ప‌రంగా ఏమీ  జ‌ర‌గ లేదు. దీంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. ఫ‌లితంగా  ప్రభుత్వ నిధులు రూ.2340 కోట్లు విడుద లయినా వృథా అయ్యాయి. ఇది రెండేళ్ల కిందటి సంగ‌తి.  పోతే, ఇప్పుడు ఏమేరకు నిధులు వృథా అయ్యా య‌న్నది ఇంకా లెక్కలు రావడం లేదు. విశాఖ జ‌డ్పీ స‌మావేశంలో ఇది హాట్ టాపిక్‌గా మారింది.  కానీ దీన్ని గురించి బొత్స స‌త్య‌నారాయ‌ణ కూడా సీఎంకి ఎలాంటి సూచ‌నా చేయ‌క‌పోవ‌డ‌మే విచిత్రం. 

ఇక  వైఎస్సార్ యంత్ర సేవా పథకం కింద గ్రూపునకు ఒక ట్రాక్టర్ ఇవ్వడం కరెక్ట్ కాదని మీరు ఎన్నయినా చెప్పండి ఆ విధంగా చేస్తే నష్టమే అని రైతులు వారి ఫిర్యాదులు అందుకు జెడ్పీటీసీలు గగ్గోలు పెడుతు న్నారు. ఖరీఫ్ ఆరంభంను పురస్కరించుకుని 2వేల 16 కోట్లతో కొన్ని యంత్రాలు అందుబాటులోకి తేవడం తో పాటు ట్రాక్టర్లు కూడా అందించేందుకు ప్రణాళికలు సిద్ధంచేసేరు.
అలాగే 3800  ఆర్బీకే స్థాయి యంత్ర సేవా కేంద్రాలకు 3800 ట్రాక్టర్లు ఇవ్వనున్నారు. 1440 యంత్ర సేవా కేంద్రాలకు వ్యవసాయ పనిముట్లు అందించనున్నారు. ఏదేమయినప్పటికీ ఏడాదికి రెండు వేల కోట్లు జలకళకు యంత్ర సేవకు మరో రెండు వేల కోట్ల చొప్పున ఈ మూడేళ్లలో 12 వేల కోట్ల రూపాయలను ప్రభుత్వం వృథా చేసిందని సరైన ప్రణాళిక లేనందువ‌ల్ల‌నే ఇలా జ‌రుగుతోంద‌ని  ప్రజాప్రతినిధుల నుంచి వ్య‌తిరేక‌త వెల్లువెత్తుతోంది.

మ‌రీ ముఖ్యంగా వైసీపీ వారే జ‌గ‌న్ ఆలోచ‌న‌ను అంగీక‌రించ‌డం లేదు.  మ‌రి ఎవ‌రి సంక్షేమం కోసం, ఎవ‌రిని ఆక‌ట్టుకోవ‌డానికి ఇలాంటి నిర్ణ‌యాలు తీసుకుంటున్నాడో జ‌గ‌న్ వివ రించాలి. ఎందుకంటే కొత్త ప‌థ‌కాలు, కొత్త ఆలోచ‌న‌లు చేయ‌డం అనేది ప్ర‌జాసంక్షేమానికి ముడిప‌డి న‌ది.  ఈ రెండుప‌థ‌కాల ప‌ట్ల విశాఖ నుంచి అనంత‌పురం వ‌ర‌కూ వ్య‌తిరేక‌త వెల్లువెత్త‌తోంది.

అయినా ఎవ‌రి  మెప్పుకోసం కోట్లాది రూపాయ‌ల్ని ప‌థ‌కాల పేరుతో త‌గ‌లేస్తున్న‌ట్టు?  జ‌గ‌న్ ఏమిచేసినా మ‌హాద్భుతం అనుకునే రోజులు పోయాయి. కాకుంటే  సీఎంకి అది స్స‌ష్టంగా  చెప్ప‌లేక‌పోతున్నారంతే!  ప్ర‌జాక‌ర్ష‌ణ కోల్పోయిన సంగ‌తి తేట‌తెల్ల‌మ‌వుతోంది, ఇప్పుడు అర్ధంలేని వ్య‌ర్ధ ప‌థ‌కాల‌కు కోట్లు వెచ్చించితే ఎవ‌రు వూరుకుంటారు జ‌గ‌న్నాధా!