మన రూపాయి ముందు ఆ దేశంలో కరెన్సీ చిల్లర పైసలే.. అది ఏ దేశమంటే..!
posted on: Jan 28, 2026 1:35PM

డబ్బు.. మనిషి జీవితానికి చాలా అవసరం. ఇప్పట్లో నీళ్లు కూడా కొనుక్కుని తాగాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే భారతీయులు అమెరికన్ డాలర్ ను చూసి ఫీలైపోతారు. డాలర్ ముందు మన రూపాయి చాలా బలహీనం అనుకుంటారు. ఎందుకంటే ఒక్క అమెరికన్ డాటర్.. మన భారత్ కరెన్సీలో 91.62 రూపాయల విలువ చేస్తుంది. కానీ ఒక దేశం ఉంది.. ఆ దేశంలో వారి 460 కరెన్సీ.. భారత్ రూపాయికి సమానం. అంటే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ ఎంత బలహీనంగా ఉందో ఊహించుకోవచ్చు. మన దేశం నుండి ఓ 100 రూపాయలు పట్టుకెళ్తే ఎంచక్కా ఆ దేశం తిరిగి రావచ్చని అంటారు. ఇంతకీ ఆ దేశం ఏది? ఆ దేశపు కరెన్సీ పేరు ఏంటి తెలుసుకుంటే..
ఇరాన్..
ఇరాన్ పశ్చిమ ఆసియాలో ఒక దేశం. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ అని అధికారికంగా పిలుస్తారు. 90మిలియన్ల జనాబా కలిగి ఉంది. భౌగోళిక పరిమాణంలోనూ, జనాబాలోనూ ప్రపంచంలో 17వ స్థానం కలిగి ఉంది. కానీ ఇక్కడ ఆర్థిక్య వ్యవస్థ బాగా బలహీనంగా ఉంది.
ఇరానియన్ రియాల్..
ఇరాన్ దేస ప్రజలు వారి కరెన్సీని రియాల్ అని పిలుస్తారు. భారతీయులు తమ కరెన్సీని రూపాయలు అన్నట్టు వారు రియాల్ అని పిలుస్తారు. అయితే ఈ రియాల్ చాలా బలహీనంగా ఉంది. డాలర్ తో కాదు కదా.. బారత్ రూపాయితో పోల్చినా రియాల్ చాలా బలహీనంగా ఉంది. ఒక్క భారత్ రూపాయి.. 460 రియాల్ కు సమానం.
అక్కడ రియాల్ బలహీనంగా ఉండటం వల్ల ఇరాన్ ప్రజలు రోజువారీ లావాదేవీలలో టోమాన్ అనే పదాన్ని వాడుతున్నారు. అక్కడ టోమాన్ అంటే 10 రియాల్స్ అని అర్థం. కానీ దీన్ని అక్కడి ప్రభుత్వం అధికారికంగా ధృవీకరించలేదు. కేవలం ప్రజలు ఏర్పాటు చేసుకున్న సౌకర్యం ఇది.
ఇరాన్ లో 1వెయ్యి రియాల్స్, 5వేల రియాల్స్, 10వేల రియాల్స్, 50వేల రియాల్స్, లక్షరియాల్స్ పేరుతో కరెన్సీ ఉంది. విలువ తక్కువ కావడం వల్ల అక్కడి కరెన్సీ నోట్లు పెద్ద సంఖ్యలతో ఉంటాయి.
ఇరాన్ దేశంలో ఆర్థిక ఆంక్షలు, ద్రవ్యోల్బణం, చమురు ఎగుమతులపై పరిమితులు ఉన్న కారణంగా కరెన్సీ విలువ తక్కువగా ఉంది. ఇద్దడ డిజిటల్ పేమెంట్స్ కంటే క్యాష్ లావాదేవిలే ఎక్కువగా జరుగుతాయట. 1000 రియాల్స్ అయితే.. 2.17 బారత్ రూపాయలు అవుతాయి. ఇదీ ఇరాన్ దేశపు కరెన్సీ కథ.
*రూపశ్రీ.







