చేతిరాత జారనివ్వొద్దు

 

 

 

నేను రాస్తే ముత్యాలు పేర్చినట్టు ఉండేది. ఇప్పుడు కోడి కెలికినట్టుంటోంది. పేజీలకు పేజీలు రాసేవాణ్ణి చెక్ బుక్ మీద సంతకం కూడా సరిగా రావడం లేదు. ' అమ్మో.. నాలుగు పేజీలా ఎప్పుడో కాలేజి డేస్ లో అంటే ఓకే ఇప్పుడు ఇంపాజిబుల్' ఇదీ ఇప్పుడు హ్యాండ్రైటింగ్ పరిస్థితి. అక్షరం.. అష్ట వంకర్లు పోతుంది. రాత.. గీత తప్పుతోంది చేతిరతకు చేటుకాలం.. ఇంకా చెప్పాలంటే ' పోయేకాలం ' దాపురించింది. 

 

పాకే వయసు లో మొదలుపెడితే బలం నుంచి పెన్సిళ్ళు, పెన్నులు, కాగితాలు, పుస్తకాలు.. ఇలా అక్షారాలు ఆసీనులయ్యే ఆసనాలు, ఆవిష్కరించే సాధనాలు మారేకొద్దీ మన చేతిరాత మరింత మెరుగులు దిద్దుకుంటూ వచ్చింది. చేతివేళ్ళ నుంచి ఊపిరి  పోసుకున్న గీత తలరాతను సైతం దిద్దగలిగింది. అంత గొప్పదైన, అక్షరాభ్యాసం నాటి  నుంచి తోడైన అపురూప బందం మసకబారిపోయింది. ' మనదైన ' చేతిరాత మనల్ని వీడిపోతుంది.... ఎందుకలా....


పోగొట్టుకోవడం 'ఈ ' జీ:-

కంప్యూటర్లు, మొబైల్స్,ల్యాప్టాప్స్, టాబ్లెట్స్ ఇవన్నీ మన చేతిరాతకు కోరుతున్నాయి. ఇపుడంతా 'ఈ' జీ ఈ జీ టెక్నాలజి. టెక్నాలజీ పుణ్యమాని చేతిరాతకి పోయేకాలం వచ్చింది నిజానికి ఒకప్పటికన్నా ఇప్పుడే మనం ఎక్కువగా రాస్తున్నాం. అయితే కీబోర్డుతో పచారి సామాన్ల జాబితా నుంచి సమావేశంలో పాఠ్యంశాల దాకా పుట్టిన రోజు శుభాకాంక్షల నుంచి పోయిన రోజు సంతాపసందేశాల దాకా అన్నీ టెక్స్ట్ మెసేజ్ లో, మెయిళ్ళో.. మరొకటో దీంతో రాయాల్సిన అవసరం రోజురోజుకూ తగ్గిపోతుంది.


సర్వేలేమంటున్నాయ్:-

ఆధునికులలో సగటున ఓ వ్యక్తీ 41 రోజులకు గాని నాల్గులైన్లు రాయాల్సిన అవసరం రావడం  లేదని, అలాగే ప్రతి ముగ్గురిలో ఒకరికి 6  నెలల పాటు కలం పట్టే ఖర్మ పట్టడం లేదట. ఇక ప్రతి ఏడుగురులో ఒకరు తమ హ్యండ్రైటింగ్ మారిన తీరు తమకే అవమానకరంగా మారిందని వాపోతున్నారట. బ్రిటిష్ కంపెనీ డాక్మెయిల్ సర్వే తేల్చిన విషయమిది. గత కొంతకాలంగా తమ చేతిరాత పాడైపోయిందని ఈ సర్వేలో పాల్గొన్న సగం మంది చెప్పారు. "చేతిరాత అవసరం తగ్గుతున్నప్పటికి,టెక్నాలజీలతో సంబంధం లేకుండా కూడా కమ్యునికేట్ చేయగల సామర్ధ్యాలను ప్రజలు నిలబెట్టుకోవల్సిందే" అని డాక్మెయిల్ కంపెనీ డైరెక్టర్  బ్రాడ్వే ఈ సందర్భంగా వ్యాఖ్యానించడం గమనార్హం.

 

ఇలా చేయండి:-

* నిద్ర ముందు ప్రతి రోజు కాసేపైన డైరీ రాయడం అలవాటుగా మార్చుకోండి.

* ఆలోచనలకు ఎప్పటికప్పుడు అక్షరరూపం ఇవ్వడానికి ప్రయత్నించండి.

* చిన్న చిన్న కథలు, ఉత్తరాలు స్వయంగా రాయండి.

* మీ లక్ష్యాలను, కలలను తరచుగా పేపర్ మీద పెడుతుండండి.

* మీకు బాగా ఇష్టులైన వారికీ చేతి రాతతో శుభాకాంక్షలు పంపడం అలవాటు చేసుకోండి.