ఢిల్లీకి కేసీఆర్ అందుకేనా?
Published on: Wed Mar 30, 2022 10:48AM
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్ళీ ఢిల్లీ వెళ్లారు. ముఖ్యమంత్రితో పాటు ఆయన సతీమణి శోభ, ఇతర కుటుంబ సభ్యులు కూడా ఢిల్లీ వెళుతున్నారు. ముఖ్యమంత్రి సతీసమేతంగా ఢిల్లీ ఎందుకు వెళుతున్నారు, అనే విషయంలో స్పష్టత లేక పోయినా, ఆరోగ్య పరీక్షల కోసమే ముఖ్యమంత్రి ఫ్యామిలీ ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లినట్లు తెరాస వర్గాలు చెపుతున్నాయి. అదే సమయంలో, వారి కొనుగోలు విషయంగా కేద్రం పై ఇప్పటికే యుద్ధం ప్రకటించిన కేసీఆర్, ధన్యం కొనుగోలు విషయం చర్చించేందుకు, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసే అవకాశం ఉందని అంటున్నారు.
అయితే, ముఖ్యమంత్రి కార్యాలయం లేదా టీఆర్ఎస్ నేతలు ఢిల్లీలో ఎవరి అపాయింట్‌మెంట్లు తీసుకోలేదని తెలుస్తోంది. గతంలోనూ ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల వైద్య పరీక్ష్లలకే, ఢిల్లీ వెళ్ళిన సందర్భంలోనూ అనేక ఊహగానాలు వినిపించాయి.అయితే చివరకు, ముఖ్యమంత్రి నాలుగు రోజులు ఢిల్లీలో ఉండి వచ్చారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అప్పాయింట్మెంట్ ఇచ్చినా ముఖ్యమంత్రి, మంత్రులను పంపారే కానీ ఆయన హాజరు కాలేదు.
అదలా ఉంటే, బీజేపీ వ్యతిరేక పార్టీల నేతలంతా సమావేశం కావాలని మమత బెనర్జీ ఇచ్చిన పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్, అదే పని మీద ఢిల్లీ వెళ్ళారా అనే మాట కూడా వినిపిస్తోంది. ఆ విధయంగా ముఖ్యమంత్రి ఆకస్మిక ఢిల్లీ పర్యటనకి ప్రాధాన్యత ఏర్పడింది.అయితే, మమతా బెనర్జీ నుంచి ముఖ్యమంత్రి కేసేఆర్’కు ఆహ్వానమే అందలేదని, అంటున్నారు. ఈ నేపధ్యంలో ముఖ్యమంత్రి కేవలం వైద్య చికిత్సల కోసం ఢిల్లీ వెళ్తున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణి శోభమ్మ గత కొంత కాలంగా ఢిల్లీలో చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే.ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా చాలా కాలంగా ఢిల్లీలోనే చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఈ చికిత్సల పని మీదే ఢిల్లీ వెళ్తున్నట్లుగా చెబుతున్నారు.అయితే సమయ సందర్భాలను బట్టి చూస్తే, ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనకు రాజకీయ ప్రధాన్యత లేకుండా ఉండదాని అంటున్నారు.


