షాంపైన్ ఎందుకు అంత ఖరీదైనది

దేవతలు అమృతం తాగి అమరులైతే సంపన్నులు షాంపైన్ తో ఆనందాన్ని రెట్టింపు చేసుకుంటారు. ధనవంతులు విందువినోదాల్లో తప్పనిసరిగా ఉంటుంది షాంపైన్. ప్రపంచంలోనే ఖరీదైన మద్యంగా దీన్ని చెప్పవచ్చు. మరి మిగతా వైన్ లకు షాంపైన్ కు వ్యత్యాసం ఎంటో తెలుసుకుంటే ఇది ఎందుకు ఇంత ఖరీదు అయినదో తెలుస్తుంది.

షాంపైన్ అనేది విలాసానికి, వినోోదానికి  పర్యాయపదంగా ఉంది. ఇతర వైన్స్ కన్నా రెట్టింప ధర ఉంటుంది.  తక్కువలో తక్కువ షాంపైన్ ధర యాభై డాలర్ల నుంచి మూడు వందల డాలర్ల వరకు ఉఁటుంది. అంతేకాదు పాత షాంపైన్ బాటిల్ ధర వెయ్యి డాలర్ల వరకు పలుకుతుంది. మరీ షాంపైన్ ఇంత ఖరీదు ఎందుకు

మెరిసేదంతా బంగారం కానట్టు షాంపైన్ గా పిలువపడే అన్ని రకాల వైన్లు షాంపైన్ కావు. కేవలం ఉత్తర ఫ్రాన్స్‌లోని షాంపైన్ ప్రాంతంలో తయారు చేస్తే షాంపైన్ మాత్రమే నిజమైన షాంపైన్. ఈ ప్రాంతం వెలుపల తయారు చేసిన అన్ని ఇతర వైన్లను, ఫ్రాన్స్   పొరుగు ప్రాంతాల నుండి వచ్చే వాటిని కూడా గుర్తించాలి.  ప్రాసిక్కో , కావా వంటి ఇతర  వైన్ల ధర కంటే రెట్టింపు ధరలో షాంపైన్ దొరుకుతుంది. మంచి-నాణ్యమైన షాంపైన్ బాటిల్ ధర ఎక్కవగా ఉంటుంది.

ప్యారిస్‌కు తూర్పున 150 కిలోమీటర్ల దూరంలో, ఫ్రాన్స్‌లోని ఈ అత్యంత రక్షిత ప్రాంతం షాంపైన్.  ప్రపంచంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన,  ఖరీదైన షాంపైన్ అమ్మకందారులకు కొనుగోలుదారులకు ఇచి కేరాఫ్ గా చెప్పవచ్చు. మోయిట్ & చాండన్ , పెరియర్-జౌట్ కంపెనీలు కూడా  ఈ ప్రాంతం వెలుపల తయారు చేసిన వైన్ లను అమ్ముతాయి. ఫ్రాన్స్ లో తయారైనా, ఫ్రాన్స్ వెలుపల తయారైన
షాంపైన్ గా లేబుల్ చేయాలి.

ఈ చిన్న ప్రాంతంలో శాన్ ఫ్రాన్సిస్కో కంటే రెండు రెట్లు ఎక్కువ పరిమాణంలో నిజమైన షాంపైన్  తయారు చేయబడుతుంది.  ప్రతి సంవత్సరం 300 మిలియన్ బాటిళ్లకు పైగా ఇక్కడ ఉత్పత్తి అవుతాయి. ఈ షాంపైన్  వార్షిక ఆదాయం 5 బిలియన్ డాలర్లు. షాంపైన్ అమ్మకాలు 1950 ల నుండి క్రమంగా పెరిగాయి.  కానీ దాని భవిష్యత్ ఈ ప్రాంతంలోని  ప్రత్యేక వాతావరణం పరి రక్షణపై ఆధారపడి ఉంది. ఉత్తర ఫ్రాన్స్  ప్రత్యేక పరిస్థితులు పెరిగిన ధరలకు మొదటి కారకం. సగటున 50 డిగ్రీల ఫారెన్‌హీట్ ఉష్ణోగ్రతతో, ఈ ప్రదేశం ఫ్రాన్స్ లో ఇతర వైన్ తోటలు పెరుగు తున్న ప్రాంతాల కంటే చల్లగా ఉంటుంది, ఇది ద్రాక్షకు
మెరిసే-వైన్ ఉత్పత్తికి సరైన ఆమ్లతను ఇస్తుంది. ఏదేమైనా, తరచుగా గడ్డకట్టే ఖండాంతర వాతావరణం,  పర్యావరణ వ్యవస్థ  వైన్ రుచిని మరింత ప్రత్యేకంగా మార్చుతాయి.

"షాంపైన్ ఎక్కువ మన్నికైనది కావడానికి  చాలావరకు  ద్రాక్ష పంట పెరిగే భౌగోళిక పరిస్థితులు, అక్కడి స్థానిక వాతావరణం పై ఆధారపడి ఉంటుంది. అంతేకాదు దాని ఉత్పత్తిచేసే విధానం కూడా ప్రత్యకంగా ఉంటుంది. కాలక్రమేణా ఈ తయారీ విధానం మరింత మెరుగుపరచబడింది.  మేము  రెండు శతాబ్దాలకు పైగా ఇక్కడ ద్రాక్షను పండిస్తున్నాం. ఇది నిజంగా  చాలా ముఖ్య మైన అంశం. దీనితో పాటు  ఆల్కహాలిక్ కిణ్వ  ప్రక్రియ లో తయారయ్యే  వైన్  చాలా  కిక్ ఇస్తుంది.  వివిధ రకాల  వైట్ వైన్లకు మించి రుచి ఇస్తుంది అంటున్నారు " ఫాబ్రిస్ రోసెట్, చైర్మన్ అండ్ సిఇవో, షాంపైన్ డ్యూట్జ్ 
ద్రాక్షపంటకోత సమయంలో దాదాపు 1,20,000 మంది కార్మికులు పనిచేస్తారు. వీరంతా 84,000 ఎకరాల విస్తీర్ణంలో పండిన  తోటల నుంచి ద్రాక్షను సేకరిస్తారు.

ద్రాక్ష పంటల సాగులో యంత్రాలను ఉపయోగించడం నిషేధం. అందుకే భూమి సాగు నుంచి పంటకోత వరకు అన్నీ కార్మికులే  చేతులతో చేస్తారు. అంతే కాదు ఉత్తమమైన ద్రాక్షను మాత్రమే ఎంచుకుంటూ   తీగల నుంచి ద్రాక్షను సేకరిస్తారు.  దీనివల్ల నాణ్యమైన ద్రాక్షను ఉపయోగించ డం వీలవుతుంది. కొండపై రోజంతా సూర్యురశ్మి తగులుతుంది. అంతేకాదు వర్షం పడినా నీరు మాత్రం ఆగదు. ఈ నేలలో ద్రాక్ష సాగు చారిత్రాత్మకంగా కొనసాగుతుంది. దీనితో ఉత్తమమైన నేలలో పండిన ద్రాక్ష లభిస్తుంది. ఇక్కడి మట్టి , వాతావరణంలో పెరిగే ద్రాక్షకు మాత్రమే షాంపైన్ తయారుచేసే ఉత్తమగుణాలున్నాయి. అంటాడు
ఇరేలియన్ లాహెర్టే, ద్రాక్ష తోటల పెంపకందారుడు.

ప్రామాణికమైన షాంపైన్ మాథోడ్ ఛాంపెనోయిస్ ద్వారా ఉత్పత్తి చేయబడుతుంది. ఇక్కడ వైన్ ఓక్ ,  స్టెయిన్లెస్ స్టీల్ వాట్స్‌  లో ప్రాధమిక కిణ్వ ప్రక్రియకు జరుగుతంది. ఆ తర్వాత  బాటిల్ లోపల ద్వితీయ కిణ్వ ప్రక్రియ జరుగుతుంది. ఈ పద్ధతి యూరోపియన్ యూనియన్‌కే పరిమితం చేయబడింది. అందుకే షాంపైన్ ప్రాంతం వెలుపల నుండి వచ్చే వైన్‌లను షాంపైన్ అని అనరు. ఏదేమైనా ప్రపంచం నలుమూల్లో అన్ని రకాల వైన్ సరిగ్గా అదే విధంగా ఉత్పత్తి చేయబడుతుంది. అయితే షాంపైన్ మాత్రం సాంప్రదాయక ద్వారా ఉత్పత్తి చేయబడుతుంది.

యూరప్ వెలుపల ఉన్న దేశాలలో కొంతమంది వైన్ తయారీదారులు యూరోపియన్ లేబులింగ్ చట్టాలను పూర్తిగా విస్మరిస్తారు. షాంపైన్ పేరుతో  మెరిసే వైన్ ఉత్పత్తిని కొనసాగిస్తున్నారు. ప్రామాణికమైన షాంపైన్ బ్రాండ్‌ను రక్షించడానికి ప్రపంచవ్యాప్తంగా 80 మందికి పైగా న్యాయవాదులతో కలిసి పనిచేసే కామిట్ షాంపైన్ ఈ అనుకరణలను నిరంతరం సవాలు చేస్తుంది. అంతిమంగా, ఉత్పత్తిలో సారూప్యతలు , రుచి ఉన్నప్పటికీ, నిజమైన షాంపైన్ మాత్రమే ఈ ప్రాంతం  చరిత్ర, ప్రతిష్టతో ముడిపడి ఉంటుంది.


షాంపైన్ ఉత్పత్తి విధానం మూడవ శతాబ్దం నాటిది. రోమన్లు మొట్టమొదట ఈశాన్య ఫ్రాన్స్‌లో ద్రాక్షతోటలను సాగుచేశారు. 17 వ శతాబ్దం మధ్యలో సీసాలో కిణ్వ ప్రక్రియ అభివృద్ధి చేయడంతో  షాంపైన్ అధికారికంగా రుచికరమైన పానీయంగా మారింది.  దీన్ని  లూయిస్ XIV హయాంలో రాజు ఇచ్చే విందులో అతిథిలకు అందించేవారు.   ప్రారంభంలో సీసాలను భూమితో దాచేవారు. అయితే
సీసాల లోపల ఉత్పత్తి అయ్యే  కార్బన్ డయాక్సైడ్ వాయువు తరచుగా సీసాలు పేలడానికి కారణమయ్యేది.

19 వ శతాబ్దం నాటికి షాంపైన్ ప్రజాదరణ పొందింది.  ముఖ్యంగా ధనిక, రాయల్ కుటుంబాల్లో  షాంపైన్ విలాసవంతమైన వైన్ గా పేరుగాంచింది.  వారి ఇంట్లో మందమైన గాజు సీసాల్లో మెరిసే షాంపైన్ బాటిల్స్  ఉంచడం స్టేటస్ గా భావించేవారు. దాంతో ఆధునిక షాంపైన్ పరిశ్రమ ఏర్పడటం ప్రారంభమైంది.

ఆశ్చర్యకరమైన విషయం ఎమిటంటే  మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధం సమయాల్లో ఈ ప్రాంతం కీలక యుద్ధభూమిగా మారినప్పటికీ, కొన్ని షాంపైన్ ఉత్పత్తి  మాత్రం కొనసాగింది. అయితే  యుద్ధం ముగిసేనాటికి షాంపైన్ ద్రాక్షతోటలలో 40శాతం నాశనమయ్యాయని అంచనా. ఉత్పత్తిలో కోత కారణంగా యుద్ధ సమయంలో తయారు చేసిన సీసాలు అధిక ధర పలికాయి.  2015 లో సోథెబైస్ క్రుగ్
యుద్ధకాలంలోని 1915నాటి షాంపైన్ బాటిల్ ను  116,000 డాలర్లకు వేలం వేసింది.

విలాసానికి, సంపదకు, ప్రముఖులకు  షాంపైన్ అనుబంధం ఎంతో ఉంది. రాజులకు పట్టాభిషేకం చేసే సమయంలోనూ, పెద్దపెద్ద నౌకలను ప్రారంభించే సమయంలోనూ షాంపైన్  ధరలను అధికంగా  ఉండేవి.
అమెరికన్ ర్యాపర్, జే-జెడ్ 2014 లో కాటియర్ కుటుంబం నడుపుతున్న షాంపైన్ బ్రాండ్ అర్మాండ్ డి బ్రిగ్నాక్ తయారు చేసే "ఏస్ ఆఫ్ స్పేడ్స్" లో భాగస్వామి అయ్యాడు. సెప్టెంబరు 2019 లో వారు 2009, 2010, 2012 ఏండ్ల నాటి ఉత్పత్తులైన అరుదైన షాంపైన్ రకాలను విడుదల చేశారు. ఇందులో 3,535 బ్రాండ్ మాత్రం  వెయ్యి డాలర్ల ధరతో అందుబాటులో ఉంది. ఈ షాంపైన్ ఆరు సంవత్సరాల పాటు బాటిల్ లో నిల్వచేయబడింది.

ప్రపంచవ్యాప్తంగా ఇంత ప్రాముఖ్యతను, డిమాండ్ ను సంపాదించుకున్న షాంపైన్ భవిష్యత్ ఏంటీ అన్నది ప్రస్తుతం తలెత్తుతున్న ప్రశ్న. షాంపైన్ ప్రపంచంలోనే మొట్టమొదటి వైన్-పెరుగుతున్న ప్రాంతంగా అవతరించింది. అయితే గణాంకాలను బట్టి చూస్తే గ్లోబల్ వార్మింగ్  కారణంగా గత 30 ఏళ్లలో ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు 1.2 డిగ్రీల సెల్సియస్ పెరిగాయి.. దాంతో ద్రాక్ష పంట కోతకు వచ్చే తేదీల్లో మార్పులు వచ్చాయి.  15రోజుల ముందుగానే పంట చేతికి వస్తుంది. షాంపైన్ ప్రాంత  వాతావరణ పరిస్థితులు మారుతున్నందున, పారిస్ ఒప్పందం వాతావరణ లక్ష్యాలు గ్లోబల్ వార్మింగ్‌ను కొనసాగించడంలో విఫలమైనందున భవిష్యత్త్ లో ఈ చారిత్రాత్మక ప్రాంతంలో వైన్ తయారీ ప్రమాదంలో పడుతుంది.