TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అంబ‌టికి ప‌ద‌వి అందుకేనా?.. సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్న‌ట్టు?

Published on: Mon Apr 11, 2022 11:37AM

అంబ‌టి రాంబాబుకు పిలిచి మ‌రీ మంత్రిప‌ద‌వి ఇచ్చారు సీఎం జ‌గ‌న్‌. ఇక మ‌రింత రెచ్చిపో అన్న‌ట్టు ప‌రోక్షంగా ఇండికేష‌న్ ఇచ్చార‌ని అంటున్నారు. బాగా నోరున్న నేత కావ‌డం.. నోటికొచ్చిన‌ట్టు వాగ‌డంలో ఆయ‌న ఎక్స్‌ప‌ర్ట్ అని అంటారు. ఇటీవ‌ల నిండు స‌భ‌లో చంద్ర‌బాబు స‌తీమ‌ణి భువ‌నేశ్వ‌రి గురించి చెత్త వాగుడు వాగ‌డం తీవ్ర క‌ల‌క‌లం రేపింది. యావ‌త్ మ‌హిళా జాతి వైసీపీ-జ‌గ‌న్‌-అంబ‌టితో పాటు ఆ న‌లుగురిపై దుమ్మెత్తి పోసింది. అప్ప‌ట్లో తీవ్ర డిఫెన్స్‌లో ప‌డిన అధికార ప‌క్షం.. ఇప్పుడు అలాంటి అడ్డ‌గోలు వ్యాఖ్య‌లు చేసిన రాంబాబుకు మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌డంపై అంతా మండిప‌డుతున్నారు. రాస‌లీల‌ల ఫోన్‌కాల్స్‌తో అడ్డంగా దొరికిపోయిన అంబ‌టికి కేబినెట్ ప్ర‌మోష‌న్ ఇచ్చి.. జ‌గ‌న‌న్న స‌భ్య స‌మాజానికి ఏం మెసేజ్ ఇస్తున్న‌ట్టు? అని ప్ర‌శ్నిస్తున్నారు ప్ర‌జ‌లు. మంత్రి ప‌ద‌వి ఇచ్చానా ఆయ‌న ప్ర‌జాసేవ చేస్తారా?  లేక‌, గంటా రెండు గంట‌ల‌తో బిజీగా ఉంటారా? అంటూ  సోష‌ల్ మీడియాలో తెగ కామెంట్లు పెడుతున్నారు. 

ఇక అంబటి రాంబాబు మాట‌ల‌ గురించి అందరికీ తెలిసిందే. ప్రెస్ మీట్ల‌తో అద‌ర‌గొట్ట‌డంలో దిట్ట‌. నోరున్నోడిదో రాజ్యం అంటారుగా.. ఆ కోవ‌లో ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి వ‌చ్చింద‌ని అంటున్నారు. చంద్ర‌బాబు, లోకేశ్‌, ప‌వ‌న్ క‌ల్యాణ్‌ల‌పై ఇక‌పై అంబ‌టి నోరు మ‌రింత పెర‌గ‌నుంది.

2014 ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి జగన్ పార్టీ అభ్యర్థిగా అంబటి పోటీ చేసి టీడీపీ సీనియర్ నేత కొడెల శివప్రసాద రావు చేతిలో ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో మళ్లీ ఆయనపై పోటీ చేసి.. సత్తెనపల్లి ఎమ్మెల్యేగా గెలిచారు. వైయస్ఆర్ ఫ్యామిలీకి నమ్మిన బంటు. రాజుల‌కి కావ‌ల‌సింది క‌ట్ట‌ప్ప‌లేగా!

1989లో రేపల్లి నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా అంబ‌టి గెలుపొందారు. 1994, 1999 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత.. వైఎస్‌ రాజశేఖర్ రెడ్డికి బాగా దగ్గరయ్యారు. 2004లో వైఎఎస్సార్ సీఎం అయ్యాక అంబ‌టికి ప్రాధాన్యం పెరిగింది. ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ పదవి వ‌రించింది. వైయస్ఆర్ ఆకస్మిక మరణంతో.. జగన్ వెంట నడిచారు అంబటి. అలా అలా ఇప్పుడు కేబినెట్ స్థాయికి ఎదిగారు రాంబాబు. గ‌తంలో ఓ టీవీ ఇంట‌ర్వ్యూలో కాపులంతా తాగుబోతులంటూ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేయ‌డం, రెండుసార్లు రాస‌లీల‌ల ఫోన్‌కాల్స్‌లో చిక్కుకోవ‌డం, ఇటీవ‌ల అసెంబ్లీలో నారా భువ‌నేశ్వ‌రిపై అసంబ‌ద్ధ వ్యాఖ్య‌లు చేసి అబాసుపాల‌వ‌డం.. ఇన్ని విమ‌ర్శ‌లు ఉన్నా.. అశ్లీల వ్య‌వ‌హారాల్లో ప్ర‌మేయం ఉంద‌నే ఆరోప‌ణ‌లు ఉన్న.. అంబ‌టి రాంబాబుకు మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌డం సీఎం జ‌గ‌న్‌కే చెల్లిందంటున్నారు.