TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కేరళం కిరీటం ఎవరికంటే?

Published on: Sun Apr 12, 2026 7:20AM

 కేరళ అసెంబ్లీ ఎన్నికల ఎర్లీ ట్రెండ్స్ ను.. పోలింగ్ సరళని చూశాక.. కాంగ్రెస్ ఆ రాష్ట్రంలో బోణీ కొట్టినట్టు తెలుస్తుంది. ఇది నిజమేనా? అందుకు అవకాశముందా? అని పరిశీలిస్తే.. ప్రస్తుత  సమాచారాన్ని బట్టి అధికార ఎల్ డీఎఫ్ ప్రతిపక్షయూడీఎఫ్ మధ్య నువ్వా నేనా అన్నట్టు హోరాహోరీగా జరిగిన ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్ 70 కాగా.. ట్రెండ్స్ ను బట్టి కాంగ్రెస్ కూటమి 72-77, లెఫ్ట్ కూటమి 55-60 స్థానాల్లో ముందంజలో ఉన్నట్టు తెలుస్తుంది. BJP ఓ ఐదు చోట్ల గట్టి పోటీ ఇచ్చినట్టు కనిపిస్తోంది.

కాగా ప్రస్తుతం  కాంగ్రెస్ లో సిఎం అభ్యర్థి విషయంలో పార్టీ ఫ్లోర్ లీడర్  సతీషన్, సీనియర్ నాయకులు రమేష్ చెన్నితల మధ్య పోటీ ఉన్నప్పటికీ.. అధిష్ఠానం మొగ్గు సతీషన్ వైపే   ఉన్నట్టు తెలుస్తోంది. ఇక మెజార్టీ ఎమ్మెల్యేలు, అధిష్టానం ఆశీస్సులతో పాటు సీనియర్ నాయకులు  కేసీ వేణుగోపాల్, శశి థరూర్ లాంటి వారి మద్దతు ఎవరికి దక్కుతుందో తెలియాల్సి ఉంది. 

ఇకపోతే రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉండే కేరళలో సిఎం పినరయ్ విజయన్ మీద జనంలో పెద్దగా వ్యతిరేకత లేనప్పటికీ.. పదేళ్ల ఎల్ డీఎఫ్ పాలన తర్వాత ఈసారి జనం  మార్పు కోరుకున్నట్టు భావిస్తున్నారు.  పదేళ్ల క్రితం సీఎంగా అచ్యుతానందన్ ను కాదని పినరయ్ విజయన్ పేరును పార్టీ ప్రకటించినప్పుడు.. పెద్దాయన పినరయ్ విజయన్ తిరువనంతపురం రావడానికి కన్నూర్ స్టేషన్ లో ఓ సాధారణ ప్రయాణికుడిగా ట్రైన్ కోసం ఎదురుచూసిన దృశ్యం అందరికీ గుర్తుండే ఉంటుంది. రేపు ఒకవేళ పదవి నుండి దిగిపోయినా అంతే హుందాగా.. ఆయనో సామాన్యుడిలా జనంతో కలిసి ప్రయాణించగలరంటున్నారు. నిజానికి రాజకీయాల్లో ఇంతటి సైద్ధాంతిక నిబద్ధత ఒక్క కమ్యూనిష్టులకే సాధ్యం. ఇవన్నీ అలా ఉంచితే పినరయి విజయన్ హాట్రిక్ కొడతారా? కాంగ్రెస్ బోణి కొట్టబోతుందా? అన్నది తేలాలంటే మాత్రం ఫలితాల వరకూ వేచి చూడాల్సిందే.