Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...తెలంగాణ కొత్త సీఈవో ఎవరో?
posted on: Feb 11, 2022 1:27PM
ఇంతవరకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా ఉన్న శశాంక్ గోయల్‌ను కేంద్ర ప్రభుత్వం గతనెల (జనవరి) 19 వతేదీనే, కార్మిక శాఖ అదనపు కార్యదర్శిగా బదిలీ చేసింది. ఇప్పుడు తాజగా ఆయన్ని కేంద్ర సర్వీసులకు బదిలీ రిలీవ్ చేసేందుకు ఎన్నికల సంఘం ఆనుమతించింది. అయితే, అయన స్థానంలో కొత్తగా ఎవరు బాధ్యతలు చేపడతారు అనే విషయంలో మాత్రం ఇంకా స్పష్టత రాలేదు.
నిజానికి కేంద్ర ప్రభుత్వం శశాంక్ గోయల్‌ను గతనెల (జనవరి) 19 వతేదీనే, కార్మిక శాఖ అదనపు కార్యదర్శిగా కేంద్ర సర్వీసులకు బదిలీ చేసింది. ఈ నేపధ్యంలో కేబినెట్ నియామకాల కమిటీ ఇటీవల గోయల్’ను కేంద్ర కార్మిక శాఖ అదనపు కార్యదర్శిగా నియమింస్తూ ఉత్తర్వులుజారీ చేసింది, దీంతో గోయల్ రిలీవ్ చేసందుకు కేంద్ర ఎన్నికల సంఘం, నిన్న (ఫిబ్రవరి 10 న) అనుమతిచ్చింది. అదనపు సీఈఓ జ్యోతి బుద్ధ ప్రకాష్‌కు ఇన్‌ఛార్జ్ సీఈఓగా అదనపు బాధ్యతలను అప్పగించింది. రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ని రిలీవ్ చేశాక శశాంక్ గోయల్ బాధ్యతలను బుద్ధ ప్రకాష్‌కు అప్పగిస్తారు.
కాగా, 1990 బ్యాచ్‌కు చెందిన డాక్టర్ శశాంక్ గోయల్ గతేడాది మేలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు ఆయన కార్మిక, పరిశ్రమలశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీగా సేవలందించారు. అలాగే ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా పనిచేశారు.
ఇక, శశాంక్ గోయల్ స్థానంలో ఎవరిని నియమించాలనే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఒక నిర్ణయానికి రాలేదని తెలుస్తోంది. కొత్త సీఈవో కోసం రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు పేర్లను కేంద్రానికి పంపించవలసి ఉంటుంది. అందులో ఒకరిని కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల ప్రధానాదికారిగా నియమిస్తుంది. అయితే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న ప్రస్తుత సమయంలో ముగ్గురు పేర్ల ఎంపిక విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆచి తూచి అడుగులు వేస్తోందని,తెలుస్తోంది. అలాగే, మాజీ సీఈఓ రజత్ కుమార్’ విషయంలో తీవ్ర ఆరోపణలు ఎదురవుతున్న సమయంలో ఇప్పటి కిప్పుడు నిర్ణయం తీసుకోవడం కంటే,ఇంకొంత ఆసమయం తీసుకోవడం మంచిదనే అభిప్రాయం ప్రభుత్వ వర్గాలు వ్యక్త పరుస్తున్నాయి.






