ఎల్ మోంచో ఎవరు?.. డ్రగ్స్ డాన్ గా ఎలా ఎదిగాడు?
posted on: Feb 24, 2026 8:54AM
.webp)
డ్రగ్స్ ప్రపంచంలో చర్చనీయాంశమైన పేరు ఎల్ మోంచో అలియాస్ నెమెసియో ఒసెగ్యురా సెర్వాంటెస్ మోస్ట్ వాంటెడె క్రిమినల్.. పోలీసు నుంచి ఒక ఉగ్రవాద ముఠా సంస్థకు అధినేతగా ఇతడి ప్రస్తానం సినిమాల్లోని విలన్ కి.. ఏ మాత్రం తీసిపోదు. పైపెచ్చు అంతకన్నా మించి. అంత భయంకరమైన డ్రగ్ మాఫియా డాన్ ఎల్ మోంచో. డ్రగ్ మాఫియా అంటే టక్కును గుర్తుకు వచ్చే పేరు అ పాబ్లో ఎస్కోబార్ అయితే.. అతడి తర్వాత అంతగా మెక్సికో, అమెరికా వ్యాప్తంగా మారు మోగిన పేరు ఎల్ మోంచో.
2009లో ఎలో మోంచో స్థాపించిన న్యూ జనరేషన్ కార్టెల్ ని ఇటీవల అంటే 2025 ఫిబ్రవరిలో అమెరికా ఒక ఉగ్రవాద సంస్థగా ప్రకటించిందంటే పరిస్థితి ఏమిటో ఊహించుకోవచ్చు. ఇక ఇతడ్ని పట్టించిన వారికి ఏకంగా 136 కోట్ల రివార్డు అందిస్తామని యూఎస్ ప్రకటించిందంటే.. సిట్యువేషన్ ఏంటో ఊహించుకోవచ్చు. అంతగా ఇతడి ప్రస్తానం కనిపిస్తుంది. 2015లో ఇతడి ముఠా.. అత్యంత పాశవికంగా 20 మందికి పైగా పోలీసుల తలలు నరికి హత్య చేసింది. అప్పట్లో ఈ దారుణఘటన డ్రగ్ మాఫియా ప్రపంచంలోనే పెను సంచలనం సృష్టించింది.
విషయమేంటంటే.. ఒకప్పుడు ఎల్ మోంచో కూడా పోలీసే. 1980ల్లో అందరు మెక్సికన్ యువకుల్లాగానే.. అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించి.. కాలిఫోర్నియాలో హెరాయిన్ సరఫరా చేస్తూ పోలీసులకు దొరికిపోయాడు. కొన్నాళ్ల పాటు అమెరికన్ జైళ్లలో జైలు శిక్ష అనుభవించిన ఇతడ్ని ఆ తర్వాతి కాలంలో మెక్సికోకి అప్పగించింది. స్వదేశానికి వచ్చిన కొత్తల్లో మోంచో మంచి బాలుడిలా పోలీసు జాబులో చేరాడు. ఆ తర్వాత డ్రగ్ మాఫియాతో చేతులు కలిపాడు. ఆ క్రమం ఎలాంటిదో చూస్తే..
మెక్సికోలోని మిచోకాన్ అనే ఒక మారుమూల గ్రామంలో పుట్టాడు ఎల్ మోంచో. చిన్నతనంలోనే చదువు మానేసిన ఇతడు అవకాడో తోటల్లో పని చేశాడు. తర్వాత మెరుగైన జీవితం కోసం అమెరికాకు అక్రమంగా వలస వెళ్లాడు. అక్కడ చిన్నపాటి డ్రగ్స్ డీలింగ్స్ చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. ఆ తర్వాత జైలు జీవితం అనుభవించాక మెక్సికోకు డిపోర్ట్ అయ్యాడు. ఒక రకంగా చెబితే దేశ బహిష్కరణ.
మెక్సికో తిరిగి వచ్చిన తర్వాత ఇతడు.. పబ్లిక్ సేఫ్టీ ఫోర్స్ లో ఒక పోలీసుగా చేరాడు. అయితే చట్టాన్ని రక్షించాల్సిన ఇతడే డ్రగ్ మాఫియాతో చేతులు కలిపాడు. పోలీసుగా ఉంటూనే డ్రగ్ కార్టెల్స్ కి ఇన్ఫార్మర్ గా పని చేశాడు. కొంతకాలానికి ఉద్యోగం మానేసి తన బావ అబిగెల్ గొంజాలెజ్ వాలెన్సియాతో చేతులు కలిపి.. మిలీనియో కార్టెల్ లో చేరాడు. 2010లో నాటి డ్రగ్స్ గ్యాంగ్స్ విడిపోయినపుడు ఎల్ మోంచో తన సొంత సంస్థ సీఎజేఎన్జీని స్థాపించాడు.
ఎల్ మోంచో ఎందుకింత మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా ఎదిగాడంటే.. శతృవులను అత్యంత కిరాతకంగా చంపడంలో ఎక్స్ పర్ట్. అంతే కాదు ఆ వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేసి తనతో పెట్టుకున్న వారెవరికైనా ఇలాంటి శిక్షే పడుతుందంటూ ఒక రకమైన భీతావహ వాతావరణం సృష్టిస్తుంటాడు. అంతే కాదు తన అనుచరులకు మిలటరీ స్థాయి శిక్షణ ఇచ్చేవాడు. అచ్చం టెర్రరిస్టు సంస్థల్లాగా. ఇక గ్రెనేడ్ లాంఛర్లు, సాయుధ వాహనాలు, డ్రోన్ బాంబులు ఉపయోగించడంలో ఇతడి ముఠా ఆరితేరిపోయింది. ఇతడి ముఠా ఆగడాలు ఎలాంటివో చెప్పడానికి 2015 నాటి ఉదంతాలే నిదర్శనం. ఇతడి గ్యాంగ్ మెక్సికన్ ఆర్మీకి చెందిన ఒక మిలటరీ చాపర్ ని కూల్చివేసింది. దీంతో ఇతడు కేవలం డ్రగ్ డీలర్ మాత్రమే కాకుండా నార్కో టెర్రరిస్టుగానూ గుర్తించింది ప్రపంచం. ఎల్ మోంచో చావు ఐదు ఖండాలను ప్రభావితం చేస్తుందంటే అతిశయోక్తి కాదు. హెరాయిన్ కంటే ప్రమాదకరమైన ఫెంటానిల్, మెథాంఫేటమిన్ సరఫరా లో ఇతడు ఐదు ఖండాల్లో సామ్రాజ్య విస్తరణ చేశాడంటే పరిస్థితి ఏమిటో ఊహించుకోవచ్చు. అమెరికా ఇతడి తలపై పది మిలియన్ డాలర్లు ప్రకటించింది. ఇతడి ఆస్తి బిలియన్ డాలర్లలో ఉంటుందని అంచనా. దీంతో ఇటు మెక్సికన్ ప్రభుత్వం అటు యూఎస్ డ్రగ్ ఎన్ఫోర్స్ మెంట్ అడ్మినిస్ట్రేషన్ ఇతడి కోసం గాలిస్తుంటాయంటే ఇతడి రేంజ్ ఏంటో ఊహించుకోవచ్చు. ఎట్టకేలకు ఆదివారం (ఫిబ్రవరి 22) మెక్సికన్ నేషనల్ గార్డ్స్ యూనిట్ ఎల్ మోంచోను హతమార్చింది.
ఎల్ మోంచో స్వరాష్ట్రమైన హలిస్కోలోని తపాల్పాలో మెక్సికో సైన్యం భారీ ఆపరేషన్ చేపట్టింది. మొత్తం 62 డ్రగ్స్ ముఠా సభ్యులను హతం చేసింది. ఎల్ మోంచో హతమయ్యాక మెక్సికోలోని పలు రాష్ట్రాల్లో అతడి ముఠా హల్ చల్ చేసింది. సూపర్ మార్కెట్లు, పెట్రోల్ బంకులు, బ్యాంకులకు నిప్పంటించింది. ఈ పరిణామాలతో కొన్ని రాష్ట్రాల్లోని స్కూళ్లను మూసేశారు. ఇక మెక్సికో ప్రజలకు అవసరమైతే తప్ప బయటకు రావద్దని ఆయా దేశ ఏంబసీలు హెచ్చరికలు జారీ చేశాయంటే సిట్యువేషన్ ఎంత భయంకరంగా ఉందో ఊహించుకోవచ్చు. ఇతడు నేషనల్ గార్డ్స్ దాడుల్లో గాయపడగా.. ఎయిర్ ట్యాక్సీ ద్వారా మెక్సికో సిటీకి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే మృతి చెందాడు. ఏది ఏమైనా ఎల్ మోంచో మరణం తర్వాత అతి పెద్ద డ్రగ్ మాఫియా శకం ఒకటి ముగిసినట్టయ్యింది.



.webp)



