ఢిల్లీ జూలో దారుణం.. విద్యార్థిని చంపిన పులి
Published on: Tue Sep 23, 2014 4:16PM

ఢిల్లీలోని జంతు ప్రదర్శన శాలలో దారుణం జరిగింది. తెల్ల పులిని ఉంచిన ఎన్క్లోజర్లో పడిపోయిన విద్యార్థి మీద పులి దాడి చేసి చంపేసింది. హిమాంశు అనే ఇంటర్మీడియట్ విద్యార్థి ఈ దాడిలో చనిపోయాడు. తెల్లపులిని ఉంచిన ఎన్క్లోజర్ చాలా కిందకు వుండటంతో విద్యార్థి లోపలకు పడిపోయాడని, దాంతో అందరూ చూస్తుండగానే పులి ఆ విద్యార్థి మీద దాడిచేసి చంపేసిందని తెలుస్తోంది. ఈ సంఘటన హిమాంశుతోపాటు జూకి వెళ్ళిన విద్యార్థుల సమక్షంలోనే జరిగింది. ఈ సంఘటన జరిగిన సమయంలో పులి ఎన్క్లోజర్ సమీపంలో భద్రతా సిబ్బంది ఎవరూ లేకపోవడంతో పులి నుంచి విద్యార్థిని కాపాడలేకపోయారు. విద్యార్థి పులి వున్న కంచె మీదకి ఎక్కి లోపలకి తొంగి చూస్తూ వుండగా లోపలకి పడిపోయాడని ఒక కథనం వినిపిస్తూ వుండగా, లోపలకి తొంగి చూస్తున్న విద్యార్థి మీద పులి దాడి చేసి లోపలకి లాగేసిందన్న కథనాలు కూడా వినిపిస్తున్నాయి.


