TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తెల్ల చొక్కా.. నల్ల కోటు.. తమిళనాడు ముఖ్యమంత్రి ఆహార్యం

Published on: Mon May 11, 2026 2:15PM

భారత రాజకీయాలలో విజయ్ తన విలక్షణతను చాటుకున్నారు. సాధారణంగా పొలిటీషియన్స్ ట్రేడ్ మార్క్ దుస్తులను ధరిస్తుంటారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని తీసుకుంటే.. ఆయన అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ఎప్పుడూ ఒకే రకంగా  ఖద్దరు చొక్కా ఫ్యాంట్ తోనే కనిపిస్తారు. అలాగే ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ నిత్యం తెల్ల చొక్కా ఖాకీ ప్యాంట్ ఆయన ట్రేడ్ మార్క్ డ్రెస్సింగ్. అలాగు తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్, సీఎం రేవంత్ రెడ్డి ఒకే రకమైన ఆహార్యంతో కనిపిస్తుంటారు. వీరే కాదు.. సాధారణంగా రాజకీయ నాయకులంతా కూడా  బహిరంగంగా కనిపించే సమయాల్లో తమదైన గుర్తింపు దక్కేలా ఒకే రకమైన దుస్తులతో కనిపిస్తారు. ఇదొక ఒరవడిగా, సాప్రదాయంగా స్థిరపడిపోయింది. 

అయితే.. ఈ ఒరవడిని, సంప్రదాయాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ బద్దలు కొట్టారు. ఆదివారం (మే 11) ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం సమయంలో విజయ్ తెల్ల చొక్కాపై నల్ల కోటు వేసుకున్నారు. ఒక ముఖ్యమంత్రిని ఎన్నడూ అలాంటి ఆహార్యంలో చూడని జనం ఆశ్చర్యపోయారు. అభినందించారు. విజయ్ ఆహార్యం సమ్ థింగ్ స్పెషల్ అని భావించారు. అంతే  కాకుండా సోమవారం ( మే 12) ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయడానికి కూడా అదే లుక్ లో అంటే తెల్లచొక్కా, నల్ల కోటు వేసుకుని వచ్చారు. దీనిని బట్టి ఇక సీఎంగా విజయ్ ఇదే డిఫరెంట్ లుక్ లో కనిపిస్తారని అర్ధం చేసుకోవచ్చు. 

ఇప్పటి వరకూ ఏ ముఖ్యమంత్రీ కూడా ఇలాంటి ఆహార్యాన్ని ఎంచుకోలేదు.నల్లకొటు ధరించే ఏకైక ముఖ్యమంత్రి విజయ్ అనడంలో సందేహం లేదు. సీఎంలు, ప్రముఖ పొలిటీషియన్లు ధరించే సాధారణ చొక్కాలు, ప్యాంట్లు మొనాటనీ అయిపోయి జనం వాటిని పట్టించుకోవడమే మానేశారని చెప్పొచ్చు. సరిగ్గా అలాంటి సమయంలో..  విజయ్ ఒక డిఫరెంట్ లుక్ ను ఎంచుకున్నారు. ఇది తమిళనాటే కాదు.. దేశ వ్యాప్తంగా అందరి ఆసక్తినీ చూరగొంది.