వైట్ హౌస్‌లో కారు బాంబు

ప్రపంచంలోనే అత్యంత పటిష్టమైన భద్రత ఉండే అమెరికా అధ్యక్షుని అధికారిక భవనం వైట్‌హౌస్‌కు బాంబు బెదిరింపు వచ్చింది. ఓ ఆజ్ఞాత వ్యక్తి వైట్ హౌస్‌కు కారు బాంబుతో వెళుతున్నట్లు చెప్పడం సంచలనం కలిగించింది. అతను చెప్పినట్లు శనివారం అర్థరాత్రి ఆ కారు వైట్‌హౌస్ సెక్యూరిటీ గేట్ వద్దకు రావడంతో సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అయితే ఎటువంటి బాంబు లభించలేదు. ముందు జాగ్రత్త చర్యగా వైట్‌హౌస్ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు..ఇటువైపు వచ్చే మార్గాలన్నిటిని మూసివేశారు.