Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కొడాలి నాని ఏరీ? ఎక్కడ? ఆరోగ్యం ఏలా ఉంది?
posted on: May 15, 2025 4:21PM
.webp)
మాజీ మంత్రి అయిన కొడాలి నాని ఒకప్పుడు వైసీపీలో ఫైర్ బ్రాండ్. వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో నాని ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా.. ఎక్కడ మాట్లాడినా చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేశ్, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై బూతుల దండకం అందుకునే వారు. అసభ్య పదజాలంతో.. నోటికి ఎంతొస్తే అంత మాట్లాడేస్తూ అదేదో గొప్ప విషయం అన్నట్లుగా భావించే వారు. ఒక దశలో కొడాలి నాని అంటే కన్నా బూతుల నాని అంటేనే ఎవరైనా గుర్తుపడతారు అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది.
అలా బూతుల నానిగా గుర్తింపు పొందిన కొడాలి నాని వైసీపీ పరాజయం నుంచి నోరెత్తడానికే భయపడు తున్నారా అన్నట్లుగా మారిపోయారు. పరాజయం తరువాత ఆయన నియోజకవర్గం ముఖం చూసిన పాపాన పోలేదు. నియోజవర్గం అనేమిటి అసలు బహిరంగంగా బయటకు వచ్చిన సందర్భాలను వేళ్లపై లెక్కించవచ్చు. అయినా చింత చచ్చినా పులుపు చావలేదు అన్నట్లుగా తాను మారలేదనీ, తనలో ఫైర్ అలాగే ఉందనీ బిల్డప్పులు ఇచ్చేందుకు శతధా ప్రయత్నించడం మాత్రం మానలేదు. అయితే ఎప్పుడైతే ఆయన మిత్రుడు, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టయ్యారో.. అప్పటి నుంచీ కొడాలి నానిలో ఫైర్ పూర్తిగా ఆరిపోయింది. అరెస్టు భయం వెన్నాడుతోంది. ఆ నేపథ్యంలోనే దాదాపుగా హైదరాబాద్ కే పరిమితమైపోయారు. కొంత కాలం కిందట ఛాతి నొప్పితో హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు.
అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం అంటూ ముంబైకి వెళ్లారు. అక్కడ ఆయనకు ఆపరేషన్ జరిగిందని చెప్పారు. అయితే కొడాలి నాని హెల్త్ బులిటిన్ ను ఆ ముంబై ఆస్పత్రి విడుదల చేయలేదు కానీ, ఆపరేషన్ విజయవంతమైందనీ, కొడాలి నాని కొలుకుంటున్నారనీ గుడివాడకు చెందిన వైసీపీ నాయకుడొకరు మీడియాకు తెలిపారు. అంతే ఆ తరువాత నుంచి కొడాలి నానికి సంబంధించి ఏ వార్తా బయటకు వచ్చిన దాఖలాలు లేవు. కొడాలి నాని ఆరోగ్య పరిస్థితి గురించి కానీ, ఆయన ఎక్కడ ఉన్నారు? ఏం చేస్తున్నారు? వంటి విషయాలేవీ బయటకు తెలియడం లేదు. కొడాలి నాని సన్నిహిత వర్గాలు మాత్రం ఆయన ఇంకా ముంబైలోనే ఉన్నారని అంటున్నారు. కానీ ఆపరేషన్ విజయవంతమైన తరువాత నెలల తరబడి ఆయన ముంబైలో ఏం చేస్తున్నారన్న ప్రశ్నకు మాత్రం బదులు లేదు. ఆయన మళ్లీ రాజకీయంగా క్రియాశీలం అవుతారా అంటే సమాధానం దొరకదు. అయితే కొడాలి నాని మాత్రం తన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా తెలుగుదేశం తనను టార్గెట్ చేయదని భావిస్తున్నట్లుగా ఉందని, రెడ్ బుక్ నుంచి తన పేరు తొలగించేస్తారని ఆశిస్తున్నారనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్ లు తనకు సేఫ్ కాదనీ, అందుకే ముంబైలోనే ఉండిపోయారనీ కూడా అంటున్నారు. ఎందుకంటే కొడాలి నాని స్నేహితుడు వల్లభనేని వంశీని ఏపీ పోలీసులు హైదరాబాద్ లోని ఆయన నివాసంలోనే అరెస్టు చేసి బెజవాడకు తరలించుకుపోయారు. దాదాపు వంద రోజులుగా వంశీ కటకటాలు లెక్కిస్తూనే ఉన్నారు. తనకూ ఆ గతే పడుతుందన్న భయంతోనే కొడాలి నాని తెలుగు రాష్ట్రాలవైపు కన్నెత్తి చూడకుండా ముంబైని షెల్టర్ జోన్ గా భావించి అక్కడే ఉండిపోయారని అంటున్నారు. వైసీపీ అధినేత బెంగళూరు షెల్టర్ జోన్ గా భావించి చుట్టపు చూపుగా మాత్రమే తాడేపల్లి ప్యాలెస్ కు వచ్చి వెడుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో జగన్ నే ఆదర్శంగా తీసుకున్న కొడాలి నాని.. కనీసం చుట్టపు చూపుగానైనా ఏపీవైపు రావడం లేదని అంటున్నారు.






