మన దేశంలో కరోనా కేసులు ఎప్పటికి తగ్గుతాయి.. రాష్ట్రాలవారీగా అంచనాలు

ఇండియాలో కరోనా పాజిటివ్ కేసులు 17 లక్షలకు దగ్గరలో ఉన్నాయి. తాజాగా ప్రతి రోజూ 50వేల కంటే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. మరో పక్క మరణాల సంఖ్య 36వేలు దాటేసింది. దీంతో కరోనా ఎప్పుడు మన దేశాన్ని వదిలిపోతుందా అని ఎదురుచూసే పరిస్థితికి వచ్చేశారు ప్రజలు. ఐతే కొన్ని తాజా అంచనాల ప్రకారం సెప్టెంబర్ 3 నాటికి దేశంలో అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతాయి. అప్పటికి సుమారుగా యాక్టివ్ కేసులు 9.86 లక్షలకు చేరతాయి. ఇక SEIR అంచనా ప్రకారం చూస్తే సెప్టెంబర్ 1 నాటికి దేశంలో యాక్టివ్ కేసులు 10.15 లక్షలుగా ఉంటాయి.

ప్రస్తుతం ప్రపంచంలో కరోనా ఎక్కువగా ఉన్న దేశాల్లో భారత్ మూడోస్థానంలో ఉండగా.. ఆసియాలో మాత్రం మొదటి స్థానంలో ఉంది. 47 లక్షల పాజిటివ్ కేసులతో అమెరికా మొదటి స్థానంలో ఉండగా, 26లక్షలకు పైగా కేసులతో బ్రెజిల్ రెండోస్థానంలో ఉన్నాయి. ఐతే ఒక ఊరట ఏంటంటే ఆ రెండు దేశాలతో పోల్చితే... భారత్ లో మరణాల రేటు చాలా తక్కువగా ఉంది. అంతే కాకుండా మొన్నటి వరకు కరోనా తీవ్రంగా ఉండే ఢిల్లీ లాంటి రాష్ట్రాల్లో కొత్త కేసులు ఇప్పుడు బాగా తగ్గుతున్నాయి. దేశంలో మరో ముఖ్య నగరం అయిన ముంబైలో కూడా కేసుల తగ్గుదల మొదలైంది. ఇది ఇలా ఉంటె పుణె, బెంగళూరు వంటి నగరాల్లోనూ ఏపీ లోను కొత్త కేసులు భారీగా పెరుగుతున్నాయి. దీనిని బట్టి ఈ వైరస్ ఒక్కో చోట ఒక్కో సమయం లో పీక్స్ కు చేరి తరువాత మెల్లగా తగ్గుతోంది. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి.

ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం ఏ రాష్ట్రాల్లో కరోనా ఎప్పుడు తగ్గుముఖం పడుతుందంటే ..

  • మహారాష్ట్రలో ఆగస్ట్ 14 నాటికి కేసులు అత్యంత ఎక్కువవుతాయి. అక్టోబర్ 26 నాటికి పూర్తిగా తగ్గుతాయి.
  • ఆంధ్రప్రదేశ్‌లో ఆగస్ట్ 23 నాటికి కేసులు బాగా పెరిగి... అక్టోబర్ 28 నాటికి తగ్గుతాయి.
  • తెలంగాణలో ఆగస్ట్ 15 నాటికి కేసులు బాగా పెరిగి... అక్టోబర్ 17 నాటికి కరోనా కొత్త కేసులు తగ్గిపోతాయి.
  • తమిళనాడులో ఆగస్ట్ 24 నాటికి బాగా పెరుగుతాయి. అక్టోబర్ 17కి తగ్గుతాయి.
  • మధ్యప్రదేశ్‌లో ఆగస్ట్ 13 నాటికి బాగా పెరిగి... సెప్టెంబర్ 30 నాటికి తగ్గుతాయి.
  • బెంగాల్‌లో ఆగస్ట్ 12 నాటికి బాగా పెరిగి... అక్టోబర్ 7 నాటికి పూర్తిగా తగ్గుతాయి.
  • కర్ణాటకలో ఆగస్ట్ 16 నాటికి బాగా పెరిగి... నవంబర్ 3 నాటికి బాగా తగ్గుతాయి
  • కేరళలో ఆగస్ట్ 10 నాటికి బాగా పెరిగి... అక్టోబర్ 15 నాటికి తగ్గిపోతాయి.
  • ఉత్తరప్రదేశ్‌లో ఆగస్ట్ 21 నాటికి బాగా పెరిగి... అక్టోబర్ 15 నాటికి తగ్గుతాయి.
  • హర్యానాలో ఆగస్ట్ 17 నాటికి బాగా పెరిగి... సెప్టెంబర్ 20 నాటికి పూర్తిగా తగ్గుతాయి.
  • గుజరాత్‌లో ఆగస్ట్ 14 నాటికి బాగా పెరిగి... అక్టోబర్ 12 నాటికి తగ్గిపోతాయి.
  • రాజస్థాన్‌లో ఆగస్ట్ 15 నాటికి బాగా పెరిగి... అక్టోబర్ 10 నాటికి తగ్గుతాయి.