TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వాట్స్‌యాప్‌తో సంసారాలు ఢమాల్...

Published on: Thu Nov 13, 2014 8:40AM

 

ఈరోజుల్లో సోషల్ మీడియా గురించి తెలియని వాళ్ళు, వాట్స్ యాప్ గురించి తెలుసుకోనివాళ్ళు అమాయకుల కింద లెక్క. ఫోన్లలో వాట్స్ యాప్ ఉపయోగించడం అనేది ఇప్పుడు ఒక గౌరవం. వాళ్ళు కాలంతోపాటు అప్‌డేట్‌గా వున్నట్టు లెక్క. ఇవన్నీ ఇలా వుంటే వాట్స్‌యాప్ పుణ్యమా అని విడాకులు తీసుకుంటున్న జంటలు ఈ మధ్యకాలంలో బాగా పెరిగిపోతున్నాయి. డోన్ట్ వర్రీ.. మన ఇండియా ఇంకా అంత డెవలప్ కాలేదు.. ఇది ఇటలీ సంగతి. వాట్స్‌యాప్‌లో కొత్తవారికి మెసేజీలు పంపడంలాంటి పనుల వల్ల ఇటలీలో భార్యాభర్తల మధ్య అపనమ్మకం బాగా పెరిగిపోతోందట. అది విడాకులకు కూడా దారి తీస్తోందట. ఇటలీ దేశంలో విడిపోతున్న జంటల్లో 40 శాతం మంది వాట్స్‌యాప్ కారణంగానే విడాకులు తీసుకుంటున్నారని ఇటలీ నుంచి పక్కా సమాచారం. ఈ గోల ఇప్పుడు ఇటలీలో వుంది.. ఇండియాకి రావడానికి ఎంతోకాలం పట్టదేమో.