TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జగన్ హస్తిన పర్యటన రద్దు.. కారణమిదేనా?

Published on: Fri Jun 24, 2022 10:51AM

పిలవని పేరంటానికి తగుదునమ్మా అంటూ వెళ్లినట్లైంది వైసీపీ అధినేత జగన్ పరిస్థితి. రాష్ట్రపతి ఎన్నిక విషయంలో బీజేపీ అడగకపోయినా బేషరతు మద్దతు ప్రకటించేసి వైసీపీ గిరిజన మహిళ కు మద్దతు ఇచ్చేశామంటూ సంబరపడిపోతోంది. అయితే రాష్ట్రపతి ఎన్నికలో మద్దతు ఇచ్చే విషయంలో రాష్ట్రానికి ఎంతో కొంత సాధించుకునేందుకు ప్రయత్నించాలన్న కనీస ప్రయత్నం కూడా జగన్ చేయకపోవడంపై పరిశీలకులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

పట్టుపట్టకపోయినా కనీసం అడిగే ధైర్యం కూడా చేయలేని జగన్ అసలు బీజేపీ నేతలకు కానీ, కేంద్రం కానీ ఎక్కడా బహిరంగంగా మద్దతు ఇవ్వాలని వైసీపీని అడిగిన దాఖలాలు లేవు. తనంత తానుగా మద్దతు ప్రకటించేసి ఘన కార్యం చేసినట్లు తన భుజాలను తానే తడిమేసుకుంటున్నారు జగన్. ఎన్డీయే నిలబెట్టిన రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు ఇవ్వాలంటూ.. కేంద్రం నుంచి ఎవరూ జగన్ ను కోరలేదు. కనీసం ఆయన హస్తినలో పర్యటించిన సందర్భంలో  ఆయన కలిసిన మంత్రులెవరూ కూడా కనీసం ఈ ప్రస్తావన తీసుకురాలేదు.

దీనిని బట్టే కేంద్రం వైసీపీకి ఇచ్చిన ప్రాధాన్యత ఏమిటో అవగతమౌతుంది. కేంద్రం సంగతి ఎలా ఉన్నా వైసీపీ తనంత తానే రాష్ట్రపతి ఎన్నికలో తమ మద్దతు కేంద్రానికి ఎంతో కీలకమని ప్రకటనలు చేసుకున్నారు. దాంతోనే విపక్షాలు, పరిశీలకులూ కూడా జగన్ తమ కీలక మద్దతు ప్రకటించడానికి రాష్ట్రానికి, రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా ఏమైనా సాధించుకునేందుకు ఉపయోగించుకోవాలని డిమాండ్ చేశారు.

అయితే జగన్ కు అంత సీన్ లేదన్న వాదనలూ చేశారు. చివరికి జగన్ స్వయంగా తనకు అంత సీన్ లేదని ముర్ము అభ్యర్థిత్వానికి ఎవరూ అడగకుండానే బేషరతు మద్దతు ప్రకటించేసి రుజువు చేసుకున్నారు.  గతతెలుగుదేశం ప్రభుత్వం అటు కేంద్రంలో భాగస్వామిగా ఉన్నా… బయటకు వచ్చినా.. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంలో పోరాడింది. అందుకు భిన్నంగా జగన్  బలమున్నా వైసీపీ ఎన్డీయే భాగస్వామ్య పక్షం కాకపోయినా కనీసం నోరెత్తడానికే భయపడుతోంది.