TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పెట్రోలు ధ‌ర‌లు ఎందుకు భ‌య‌పెడుతున్నాయి?

Published on: Wed Jun 22, 2022 2:30PM

రయ్‌మంటూ బైక్ మీద వెళుతూ హ‌ఠాత్తుగా పెట్రోల్ అంత‌గా లేద‌ని గుర్తొచ్చి ఒక  కుర్రాడు పెట్రోల్ బంక్ వెళ్లాడు. స్ట‌యిల్‌గా లీట‌ర్ అన‌గానే బంక్ వాడు  ర‌వ్వంత ఎక్క‌వే కొట్టి చిల్ల‌ర లేకుండా పెద్ద మొత్త‌మే  తీసుకున్నాడు. కుర్రాడు ఆశ్చ‌ర్య‌పోయాడు. ఇదే దృశ్యం ఈ రోజుల్లో అన్ని ప్రాంతాల్లో చూస్తున్నాం. అస‌లు ఇలా పెట్రోల్ రేటు ఎందుకు పెరుగుతోంది?  

నిజానికి ర‌ష్యా ఫిబ్ర‌వ‌రి 24న ఉక్రెయిన్ మీద దాడి చేయడానికి ముందు నుంచే పెట్రోల్ ధ‌ర‌లు ఆకాశా న్నంటాయి. కానీ మార్చి మ‌ధ్య నుంచి ముడి చ‌మురు ధ‌ర పెర‌గ‌డంతో పెట్రోల్ ధ‌ర‌లు పెరుగుతూ వ‌చ్చా యి.  పెరిగిపోయిన  ప్రపంచ డిమాండ్‌ను  తీర్చడానికి  ముడి చమురును గ్యాసోలిన్, డీజిల్‌గా శుద్ధి చేయడానికి తగిన సామర్ధ్యం లేకపోవడమే దీనంత‌టికీ  కార‌ణం.

అంత‌ర్జాతీయ ఎన‌ర్జీ ఏజెన్సీ (ఐఇఏ) ప్ర‌కారం, ప్ర‌పంచ రిఫైన‌రీలు రోజూ వంద మిలియ‌న్ బ్యార‌ల్స్ చ‌మురు  ఉత్ప‌త్తి చేస్తాయి. కానీ  అందులో సుమారు 20 శాతం ఉప‌యోగ‌ప‌డ‌టం లేద‌ని తెలిసింది. ఇందులోనూ అధిక భాగం లాటిన్ అమెరికా, ఇత‌ర ప్రాంతాల్లోనే వినియోగంలో లేదు. అందుక్కార‌ణం అక్క‌డ పెట్టుబ‌డుల లోపం కార‌ణంగా చెప్పుకోవ‌చ్చు. ఫ‌లితంగా  అంచ‌నా సామ‌ర్ధ్యంలో రోజుకు సుమారు 82-83 మిలియ‌న్ బ్యారెల్ ఉత్ప‌త్తి విక్రయానికి నోచుకోక మిగిలిపోతోంది.

2020  ఆరంభం నుంచి రోజూవారి రిఫైనింగ్ సామ‌ర్ధ్యంలో 3.3 మిలియ‌న్ బ్యారెల్స్ చ‌మురును  ప్ర‌పంచ దేశాలు న‌ష్ట‌పోతున్నాయ‌ని రిఫైనింగ్ ఇండ‌స్ట్రీ అంచ‌నా.  ఈ న‌ష్టంలో  సుమారు మూడ‌వ వంతు  యు. ఎస్ లో సంభ‌వించింది. మిగ‌తా న‌ష్టం ర‌ష్యా, చైనా, యూర‌ప్‌లో సంభ‌వించింది. కాగా కోవిడ్‌-19 ప్ర‌భావం తొలినాళ్ల‌లో  లాక్‌డౌన్‌, ప‌నులు నిలిచిపోవ‌డం మొద‌ల‌యిన కార‌ణాల వ‌ల్ల చ‌మురు డిమాండ్  బాగా ప‌డిపోయింది. అంత‌కుముందు మూడు ద‌శాబ్దాల్లో అంత‌గా రిఫైనింగ్ సామ‌ర్ధ్యం ప‌డిపోలేదు.

రిఫైనింగ్ సామ‌ర్ధ్యం పుంజుకునే అవ‌కాశం వుందా అనే ప్ర‌శ్న త‌లెత్తుతోంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా చ‌మురు శుద్ధి సామ‌ర్ధ్యం విస్త‌ర‌ణ 2022లో రోజుకు ఒక మిలియ‌న్ బిపిడి విస్త‌ర‌ణ‌కు నిర్ధారించ‌బ‌డింది. అలాగే 2023 లో 1.6 మిలియ‌న్ బిపిడిలు. ఈ ఏడాది ఏప్రిల్‌లో  రోజుకు 78 మిలియ‌న్ బ్యారెల్స్ ప్రాసెస్ జ‌రిగింది. ఇదే కోవిడ్‌-19కి ముందు సుమారు 82.1 మిలియ‌న్ బిపిడిలు ప్రాసెస్ జ‌రిగింది.

 చైనా రిఫైనర్‌లు ఆన్‌లైన్‌కు తిరిగి  రావడంతో వేసవిలో రిఫైనింగ్ 81.9 మిలియన్ బిపిడి కి  పుంజుకుం టుందని ఐఇఏ  అంచనా. అయితే యు.ఎస్‌, చైనా, యూర‌ప్ అన్నీ కోవిడ్‌-19కి ముందుకంటే త‌క్కువ స్థాయిలో చ‌మురు శుద్ధి సామ‌ర్ధ్యం త‌క్కువ స్థాయిలో చేప‌డుతున్నాయి. యు.ఎస్‌. రిఫైన‌రీలు అనేక కార ణాల వ‌ల్ల 2019 నుంచి  సుమారు ఒక మిలియ‌న్ బిపిడి త‌గ్గించింది. ర‌ష్యా చ‌మురు శుద్ధి సామ‌ర్యం మే నెల నుంచి సుమారు 30 శాతం నిరుప‌యోగంగా వుంది. పైగా ర‌ష్యా చ‌మురును అనేక  ప‌శ్చిమ దేశాలు నిరాక‌రించాయి. 

ధ‌ర పెర‌గ‌డానికి కార‌కాల విష‌యానికివ‌స్తే, ప్ర‌పంచ వ్యాప్తంగా వున్న డిమాండ్ పెర‌గ‌డంతో  స‌ముద్ర మార్గంలో ఓడ‌ల్లో చ‌మురు ఉత్ప‌త్తులను తీసికెళ్ల‌డానికి అయ్యే ఖ‌ర్చు పెరిగిపోయిది. యూర‌ప్‌లో నేచు ర‌ల్ గ్యాస్ ధ‌ర‌లు ఆకాశాన్నంట‌డం చ‌మురు శుద్ధి క‌ర్మాగారాల‌కు ఆటంకంగా మారింది. కాగా  కొన్ని చ‌ము రు శుద్ధి క‌ర్మాగారాలు మ‌ధ్యంత‌ర చ‌మురుగా వాక్యూమ్ గ్యాస్ ఆయిల్ మీద ఎక్కువ‌గా ఆధార‌పడ్డాయి. ర‌ష్యా గ్యాస్ ఆయిల్ న‌ష్టాలతో కొన్న గ్యాస్ ఆయిల్ ఉత్ప‌త్తి య‌నిట్లు నిలిచిపోయాయి. 

ఈ ప‌రిస్థితులు కొంద‌రికి ఎంతో ఉప‌యోగ‌క‌రంగా మారాయి. ముఖ్యంగా యు.ఎస్‌. రిఫైన‌రీలు వంటి విదేశా ల‌కు అత్య‌ధిక చ‌మురును ఎగుమ‌తి చేసే రిఫైన‌రీలే ఎక్కువ‌గా ల‌బ్ధి పొందాయి. ప్ర‌పంచ వ్యాప్తంగా చ‌మురు త‌రుగుద‌ల చ‌మురు శుద్ధి ప‌రిమితుల‌ను చారిత్రాత్మ‌కంగా  అత్య‌ధిక స్థాయికి  చేర్చ‌డం గ‌మ‌నార్హం.