Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...నేనేమీ చేశాను నేరం.. శోక సంద్రంలో మాజీ హోం మంత్రి
posted on: Apr 30, 2022 7:04AM
మేకతోటి సుచరిత... తెలుగు ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు. ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మాజీ మంత్రి. ముఖ్యమంత్రి తర్వాత స్థానంలో ఉండి కూడా ఈ సుచరిత... ఏనాడు.. ఎఫ్పుడు... ఎక్కడా.. అధికారం అడ్డం పెట్టుకుని.. హల్‌చల్ చేయలేదు. మూడేళ్ల పాటు ఆ పదవిలో ఉన్న ఆమె.. ఎన్ని ప్రెస్‌మీట్లు పెట్టిందంటే మాత్రం వెళ్ల మీద లెక్క పెట్టి మరీ చెప్పవచ్చు. ఇంకా చెప్పాలంటే.. అంతా కామ్ గోయింగే. తన పనేదో తనదే... ఇంకా క్లియర్ కట్‌గా చెప్పాలంటే మాత్రం తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆదేశాలు వస్తేనే కానీ ఈ హోం మంత్రిగారు ప్రెస్ మీట్ పెట్టీ నోరు విప్పిరంటూ సుచరిత మీద ప్రతిపక్ష టీడీపీ అయితే ఓ అపవాదు కూడా వేసి పారేసింది.
అయితే జగన్ కేబినెట్ ఇటీవల కొత్తగా కొలువు తీరడం.. ఆ క్రమంలో సుచరిత కామెంట్స్ చేయడం.. ఫ్యాన్ పార్టీ రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ.. రంగంలోకి దిగి ఆమె ఇంటికి వెళ్లడం.. ఆయన చేతినే సుచరిత.. తన ఎమ్మెల్యే పదవికి స్పీకర్ ఫార్మెట్‌లో రాజీనామా లేఖ ఇవ్వడం.. ఇదే విషయాన్ని సుచరిత కుమారుడు, కుమార్తె స్వయంగా మీడియాకు వెళ్లడించడం... ఆ క్రమంలో సుచరిత నివాసం వద్ద ఆమె అనుచరులు అయితే ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై ఓ రెంజ్‌లో ఫైర్ కావడం.. ఆ తర్వాత సీఎం జగన్‌తో సుచరిత భేటీ అవడం.. అనంతరం ఆమె కూల్‌గా మీడియా ముందుకు వచ్చి.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా లేదు.. ఏమీ లేదు.. అంటూ ముక్తాయింపు ఇవ్వడం జస్ట్ మూడు నాలుగు రోజుల్లో అంత సద్దుమణిగిపోయింది.
అయితే మేకతోటి సుచరిత హోం మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆమె మాజీ మంత్రి అయ్యే వరకు.. సొంత పార్టీలోనే చాలా సమస్యలు ఎదుర్కొన్నారని సమాచారం. హోం మంత్రిగా ముఖ్యమంత్రి తర్వాత స్థానంలో ఉన్నా.. ఆమెకు ఈ జగన్ ప్రభుత్వం సరైన గుర్తింపు ఇవ్వలేదని మేకతోటి సుచరిత తరచు తన సన్నిహితుల వద్ద వాపోయే వారట. గుంటూరు జిల్లాకు చెందిన మంత్రి అయినా ఆమెకు సరైన ప్రోటోకాల్ కూడా పాటించేవారు కాదని సుచరిత సొంత నియోజకవర్గ ప్రజలే గుసగుసలాడుకోవడం గమనార్హం. ఇక ఆమె ప్రెస్‌మీట్ పెట్టాలంటే.. తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆదేశాలు రావాలని.. ఈ నేపథ్యంలో ఒకానొక సమయంలో ఆమె తీవ్ర నిరాశా నిస్పృహాలోకి వెళ్లిపోయారని పత్తిపాటులోని కేడర్‌లో ఓ టాక్ అయితే నేటికి వైరల్ అవుతోంది.
అంతేకాదు.. మంగళగిరి నియోజవకర్గంలో అయితే కొన్నిప్రభుత్వ కార్యక్రమాల ప్రారంభోత్సవాల్లో సైతం శిలాఫలకాలపై ఆమె పేరు ఉండేది కాదట... ఈ విషయం ముందుగానే తెలుసుకుని.. ఆయా కార్యక్రమాలకు సుచరిత డుమ్మా కొట్టేవారని నియోజకవర్గ ప్రజలే చెప్పుకోవడం గమనార్హ:. మరోవైపు తన శాఖను అనదికారికంగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చాలా సార్లు నిర్వహించడం పట్ల సుచరిత.. లోలోపల రిగిలిపోయే వారని సమాచారం. అంతేకాదు.. జగన్ ప్రభుత్వం ఎంతో అట్టహాసంగా నిర్వహించే ప్రపంచ మహిళా దినోత్సవం తదితర కార్యక్రమాల్లో విడుదల రజినీ, రోజా, వాసిరెడ్డి పద్మ, తానేటి వనిత తదితరులు ఉన్నా.. అక్కడ సుచరిత లేక పోవడం పట్ల .. పార్టీ మహిళల్లోనే ఓ సందేహాలు వ్యక్తమయ్యేవని సమాచారం.
అదీకాక సుచరిత భర్త మేకతోటి దయాసాగర్. ఆయన ఐఆర్ఎస్ అధికారి. ఈ నేపథ్యంలో విజయవాడలో ఆయన కీలక అధికారిగా బాధ్యతలు చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని కీలక నేతలు ఆగమేఘాల మీద రంగంలోకి దిగి.. భార్య కీలక మంత్రి పదవిలో ఉండి.. భర్త మరో కీలక పదవిలో ఉండడం చట్టాలకు విరుద్దమంటూ సదరు కీలక నేతలు కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్‌కు ఫిర్యాదులు మీద ఫిర్యాదులు చేయడమే కాదు..నాటి హోం మంత్రి సుచరిత భర్తను మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్‌కు బదిలీపై సాగనంపే వరకు సదరు ఫ్యాన్ పార్టీ నేతలు విశ్రమించిందే లేదని సమాచారం. ఆ తర్వాత ఈ విషయాలన్నీ తెలుసుకున్న సుచరిత.. తనలో తానే కన్నీరుమున్నీరు అయినట్లు తెలుస్తోంది. ఈ విషయాలన్నీ తెలిసి కూడా ఎప్పుటికప్పుడు మిన్నకుండి పోవడం తాను చేసిన పెద్ద తప్పని సుచరిత తన సన్నిహితుల వద్ద వాపోయినట్లు తెలుస్తోంది.






