TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఈ ఫైర్ అప్పుడేమైంది జూనియర్?

Published on: Thu Oct 3, 2024 5:51PM

తెలంగాణ మంత్రి కొండా సురేఖ సమంత, నాగచైతన్య విడాకుల విషయంపై చేసిన వ్యాఖ్యలను హీరో  జూనియర్ ఎన్టీఆర్ గట్టిగా ఖండించారు. ఘాటు మాటలతో కొండా సురేఖ వ్యాఖ్యలను తప్పుపట్టారు. టాలీవుడ్ నుంచి  అందరి కంటే ముందుగా   కొండా సురేఖ వ్యాఖ్యలను తప్పుపడుతూ , అక్కినేని కుటుంబం, సమంతకు మద్దతుగా నిలిచిన ఎన్టీఆర్ ను పలువురు ప్రశంసలలో ముంచెత్తుతున్నారు. ఈ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ నిజమైన  హీరోలా స్పందించారంటూ పొగడ్తలు గుప్పిస్తున్నారు.

అదే సమయంలో ఆయన హీరోయిజం సెలెక్టివ్ ఇష్యూస్ కేనా అన్న అనుమానాలూ వ్యక్తం చేస్తున్నారు. తన వ్యాఖ్యలకు గట్టి రిటార్డ్ ఎటువైపు నుంచీ రాదన్న నమ్మకం ఉంటేనే ఎన్టీఆర్ హీరోయిజం బయటకు వస్తుందా అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అంటే కొండా సురేఖ కామెంట్లపై స్పాంటేనియస్ గా స్పందించి నాగార్జున కుటుంబానికి, సమంతకు మద్దతుగా గట్టిగా గొంతు వినిపించడానికి తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయంతో తన స్పందనను పెద్ద సీరియస్ గా తీసుకోదన్న నమ్మకంతోనే అని అంటున్నారు.

ఎందుకంటే గతంలో  ఏపీలో జగన్ సర్కార్ ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్చినప్పుడుగానీ, లేక సొంత మేనత్త నందమూరి భువనేశ్వరిపై వైసీపీయులు అసెంబ్లీ సాక్షిగా అనుచిత వ్యాఖ్యలు చేసిన సమయంలో కానీ జూనియర్ ఎన్టీఆర్ ఈ స్థాయిలో ఎందుకు స్పందించలేదని నిలదీస్తున్నారు. అప్పట్లో ఆయన స్పందన సాదా సీదాగా, ఎదో స్పందించక తప్పదన్న రీతిగా ఉండటాన్ని ఇప్పుడు ఎత్తి చూపుతూ, నాటి ఆయన స్పందనకు సంబంధించి వీడియోలను సామాజిక మాధ్యమంలో వైరల్ చేస్తున్నారు.  

ఇది కూడా చదవండి తాత మీద ప్రేమ  మాటలకే పరిమితమా ఉత్తర కుమార!