Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కేశినేని నాని హడావుడి.. తన కోసమా? కుమార్తె ఫ్యూచర్ కోసమా?
posted on: May 21, 2025 2:18PM
.webp)
విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని మళ్లీ రాజకీయాల్లోకి వస్తున్నారంటూ విస్తృతంగా ప్రచారం సాగుతోంది. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత రాజకీయాలకు గుడ్ బై చెప్పిన నాని మళ్లీ అదృష్టం పరీక్షించుకునేందుకు రెడీ అయ్యారట. గత సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం నుంచి టీడీపీ టికెట్ దక్కకపోవడంతో వైసీపీలో చేరిన కేశినేని నాని తమ్ముడి చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. గతేడాది జూన్ 10న ఇక రాజకీయాల్లోకి వచ్చేదే లేదని చెప్పారు. కానీ ఇప్పుడదే కేశినేని నాని బీజేపీ నాయకులతో రాజకీయ చర్చలు జరుపుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ లాంటి వారితో ఉన్న సత్సంబంధాల నేపథ్యంలోఆయన తిరిగి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారనే ప్రచారం మొదలైంది.
కేశినేని నానితో పాటు ఆయన కుమార్తె కూడా విజయవాడ కార్పొరేటర్ పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో కేశినేని నాని తన కోసం అడుగులు వేస్తున్నారా? కూతురు రాజకీయ భవిష్యత్ కోసం ప్రయత్నిస్తున్నారా? అనేది సస్పెన్స్‌గా మారింది. ప్రజారాజ్యం పార్టీతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కేశినేని నాని, 2019లో రెండోసారి ఎంపీగా గెలిచిన తర్వాత తెలుగుదేశంలో రెబల్ అవతారం ఎత్తారు. పార్టీ అధిష్టానాన్ని ధిక్కరించేలా నాని వ్యవహారశైలి కొనసాగింది. 2023 విజయవాడ ఎంపీ టికెట్‌ని.. ఆయన తమ్ముడు చిన్నికి ఖరారు చేయడంతో, నాని వైసీపీ కండువా కప్పుకున్నారు. అయితే.. ఎన్నికల్లో మాత్రం తమ్ముడిపై గెలవలేకపోయారు. అప్పట్నుంచి పొలిటికల్‌గా సైలెంట్ అయ్యారు.
రాజకీయాలకు దూరమై, పొలిటికల్‌గా పూర్తిగా సైలెంట్ అయ్యాక, మళ్లీ ఈ మధ్య కాలంలో కేశినేని నాని తరచు వార్తల్లో నానుతున్నారు. సోషల్ మీడియా వేదికగా తన తమ్ముడు, ఎంపీ కేశినేని చిన్నిపై నిప్పులు చెరుగుతున్నారు. అవినీతి ఆరోపణలతో విరుచుకుపడుతున్నారు. రాజకీయాలతో సంబంధం లేదంటూనే, రాజకీయ విమర్శలు చేస్తూ, తాను రాజకీయంగా యాక్టివ్‌గానే ఉన్నానని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారనే చర్చ సాగుతోంది. బ్యాక్ ఎండ్‌లో వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. చిన్ని టార్గెట్‌గా విమర్శలు చేస్తూ, క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలను కూడా తప్పుబడుతూ, సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడుతున్నారు. అయితే.. ఇదంతా మళ్లీ తాను రాజకీయాల్లోకి వచ్చేందుకే అంటున్నారు. నిజంగానే కేశినేని నాని.. పొలిటికల్‌గా యాక్టివ్ అవుతారా? లేక.. తమ్ముడి మీద ఆరోపణలతోనే ఆగిపోతారా? .. అన్నది చూడాలి.






