TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బిందూ.. స‌భ్య‌స‌మాజానికి సందేశ‌మేమిటి?

Published on: Fri Jun 10, 2022 11:55AM

పెళ్లి అనేది గొప్ప వేడుక‌. బంధువులు, స్నేహితులు నానా హ‌డావుడి మ‌ధ్య బ్ర‌హ్మాండంగా జ‌రిగేది. ఇటీవ లి కాలంలో పెళ్లి అనేది త‌మ స్థాయిని ప్ర‌ద‌ర్శించేందుకు ఒక మార్గంగానూ భారీ ఎత్తున నిర్వ‌హిస్తున్నా రు. అస‌లు పెళ్లి అంటే వ‌రుడు, వ‌ధువు వారికి అన్ని హంగులు క‌ల్పించ‌డం అంతా ఆక‌ర్ష‌ణీయంగా, క‌నుల విందుగా వుంటుంది. కానీ అదేంటో క్ష‌మా బిందు అనే అమ్మాయి లోకం ఆశ్చ‌ర్య‌ప‌డేలా పెళ్లి చేసుకుంది.ఈమె పెళ్లి  క‌నీసం ఓ ఏడాదిపాటు దేశ‌మంతా ప్ర‌చార‌మ‌యినా పెద్ద‌గా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదు. మ‌రి అలా అయింది ఆమె పెళ్లి.

పెళ్లిళ్ల‌ల్లో సోలోగామీ  అనే ప‌ద్ధ‌తీ వుంద‌న్న‌ది  క్ష‌మా బిందు  పెళ్లితో అంద‌రికీ  బాగా తెలిసింది. త‌న‌ను  తాను ప్రేమించుకుని, త‌న‌ను తానే పెళ్లి చేసుకోవ‌డం విన్నారా? అదే విచిత్రం. అదే క్ష‌మా బిందు అనే గుజ రాతీ అమ్మాయి చేసిన ఘ‌న‌కార్యం. గుజ‌రాత్ వ‌డోద‌రాకు చెందిన  ఈ  24  ఏళ్ల క్ష‌మా బిందు త‌నను తాను మ‌ను వాడింది. ఈ పెళ్లికి పూజారి లేడు, అయిన త‌ర్వాత కొంగులు త‌డిసేలా ఏడిచేందుకు అప్ప గింతలూ లేవు. సోలోగామీ  సౌఖ్యంబిదే అమ్మాయిలూ!  
ఇదేమి వివాహం అని చెవులు  కొరుక్కోన‌క్క‌ర్లేదు. చాలా కాలం స‌హ‌జీవ‌నం చేసి  బాగా  ఒక‌రినొక‌రు తెలు సుకున్న త‌ర్వాత పెళ్లిళ్లు చేసుకుంటున్న‌సంగ‌తి ఈరోజుల్లో చాలా మామూలయి పోయింది. అస‌లు ఒక రిని పెళ్లిచూపుల పేరుతో ఒక వ్య‌క్తికి చూపించి జాత‌కాలు క‌లిసేయ‌న్న గ‌ట్టి న‌మ్మ‌కంతో ఇరు కుటుంబాలు పెళ్లి చేస్తుండ‌టం అనాదిగా వున్న‌ది. కాల‌క్ర‌మంలో  అమ్మాయి, అబ్బాయి  ముఖ్యంగా ఒకే ప్రొఫెష‌న్‌లో వున్న‌వారు అండ‌ర్‌స్టాండింగ్ మీద క‌లిసి వుండి కొద్ది నెల‌ల‌కో, ఏడాది త‌ర్వాత‌నో ఇక పెళ్లి చేసుకుందా మ‌ని త‌ల్లిదండ్ర‌ల‌ను ఒప్పించి లేదా స్నేహితుల స‌హాయంతోనో పెళ్లి చేసేసుకుం టున్నారు. కానీ క్ష‌మా బిందు ఒక్కింత అడుగు ముందుకేసి అస‌లు పెళ్లికి వ‌రుడు అవ‌స‌ర‌మా అని ప్ర‌శ్నించింది. త‌న‌ను తానే పెళ్లిచేసుకోవ‌డం అనే ఒక కొత్త పోక‌డ‌కు నాంది ప‌లికింది. 
  వివాహ వ్య‌వ‌స్థ మీద‌నే న‌మ్మ‌కం లేని యువ‌తులు పెళ్లి చేసుకోకుండా వుండ‌డం వేరు. స్నేహం చేసి విడిపోవ‌డ‌మూ వేరు. కానీ త‌న‌కు పెళ్లి అంటే ఇష్టమే గాని అబ్బాయినే పెళ్లి చేసుకోన‌క్క‌ర్లేదు అన్ని విధాలా అండ‌ర్‌స్టాండింగ్ వున్న అమ్మాయినీ పెళ్లి చేసుకోవ‌చ్చు అనే విచిత్ర వివాహాలు జ‌రుగుతున్నా యి. ఇప్పుడు  ఈ వ‌డోద‌రా పిల్ల ఏకాఎకీ త‌న‌ని తాను పెళ్లి చేసుకుంది. పైగా గోవా ట్రిప్ కి వెళుతుందిట‌! పెళ్లికి, గోవా హ‌నీమూన్‌కీ క్ష‌మా త‌లిదండ్రులు ఓకే అనేయ‌డ‌మే ఇక్క‌డి ఊహించ‌ని ట్విస్ట్‌. ఇలాంటివి ప్రోత్స‌హించ‌డం ఎంత‌వ‌ర‌కూ స‌మంజ‌సం అనే ప్ర‌శ్న ఇప్పుడు త‌లెత్తుతుంది. దీన్ని ప్రోత్స‌హించి గుజ రాతీ వారూ స‌భ్య‌స‌మాజానికి ఏ సందేశం ఇచ్చిన‌ట్టు??!