సిర్పూర్ కర్ కమిటీ నివేదిక ఏమైంది?.. సైడ్ ట్రాక్ చేయడానికేనా జూబ్లీ కేసు గోల
Published on: Thu Jun 9, 2022 5:36PM
కొన్ని సంఘటనలు చాలా చిత్రంగా మలుపు తిరుగుతుంటాయి. ఒక కేసుకు సంబంధించిన విచారణ మరో కేసు విచారణను జనం కూడా మర్చిపోయేలా చేస్తుంటుంది. అంతేకాదు అసలు ఆసంగతి ఎవరికీ గుర్తు రాకుండా మరో కేసు తాలూకు విచారణలో పోలీసులు, జనం తలమునకలయ్యేట్టు చేయడం చాలా తెలివిగా జరుగుతుంది. సరిగ్గా ఇలాంటిదే ఇపుడు హైదరాబాద్‌లో అందరూ గమనిస్తున్న చిత్ర రాజం!
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచారం కేసులో ఎన్‌కౌంటర్ మీద మే 20న సుప్రీంకోర్టు విచారణ ముగిసింది.
2019 డిసంబర్‌లో హైదరాబాద్ సమీపంలో జరిగిన నలుగురి ఎన్‌కౌంటర్పై సిర్పూర్ కర్ కమిషన్ తన నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించింది. సీజేఐ ఎన్వీ రమణ, జస్టిస్ హిమా కోహ్లీ తో కూడిన ధర్మాసనం కమిషన్ రిపోర్ట్‌ను అందుకుంది. అయితే దాన్ని సీల్డ్ కవర్‌లోనే వుంచాలన్న తెలం గాణ ప్రభుత్వ సూచనని కోర్టు తిరస్కరించింది. అంతేకాదు ఆ కేసుకు సంబంధించిన వారికి ఆ రిపోర్ట్ అందజేయాలని ధర్మాసనం ఆదేశించింది. తెలంగాణా హైకోర్టుకి ఆ రిపోర్టు పంపి దాని మీద వెంటనే తదుపరి చర్యలు తీసుకోవలన్నది. చట్ట ప్రకారం ఏం చేయాలో హైకోర్టు నిర్ణయిస్తుందని సీజేఐ వ్యాఖ్యా నించారు. ఈ కేసు విచారణలో భాగంగా వీసీ సజ్జనార్ ధర్మాసనం ఎదుట హాజరయ్యారు. అలాగే.. నివేదిక కాపీలను ఇరు పక్షాలను అందించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
26 ఏళ్ల వెటర్నరీ లేడీ డాక్టర్‌ను రేప్ చేసి హత్య చేసిన కేసులో నలుగురు వ్యక్తులను పోలీసులు ఎన్‌కౌం టర్ చేశారు. ఆ కేసులో విచారణ చేపట్టేందుకు అప్పటి సీజేఐ ఎస్ఏ బోబ్డే ఓ ఎంక్వైరీ ప్యానల్‌ను ఏర్పా టు చేశారు. సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ వీఎస్ సిర్పూర్కర్ నేతృత్వంలో ప్యానల్ ఆ ఎన్‌కౌంటర్‌పై రిపోర్ట్‌ను తయారు చేసింది. ఆ బృందంలో బాంబే హైకోర్టు జస్టిస్ రేఖా బాల్దోటా, సీబీఐ మాజీ డైరెక్టర్ డీఆర్ కార్తికేయన్ ఉన్నారు. రిపోర్ట్‌ను సీల్డ్ కవర్‌లోనే ఉంచాలని తెలంగాణ సీనియర్ న్యాయవాది శ్యామ్ దివన్ కోరారు.
కానీ ఆ అభ్యర్థనను సీజేఐ తిరస్కరించారు. దీంట్లో రహస్యం ఏమీ లేదని, కొందరు దోషు లుగా తేలారని, ఇక హైకోర్టు ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని సీజేఐ రమణ తెలిపారు.దిశ నిందితులు మొత్తం 4 మందిని అదే తరహాలో కాల్చివేశారు, మరెంతో మందిని లైంగికంగా వేధించా రు. పోలీసుల దర్యాప్తులో వెల్లడవుతున్న షాకింగ్ విషయాలేమంటే..రేప్ కేసు నిందితులను చంపా లన్న ఉద్దేశంతో పోలీసులు ఎన్‌కౌంటర్ చేసినట్లు కమిటీ తన రిపోర్ట్‌లో తెలిపింది. నలుగురు నిందితుల్లో ముగ్గురు మైనర్లు ఉన్నారని, హైదరాబాద్ పోలీసుల పనితీరుపై కూడా రిపోర్ట్‌లో పొందుపరిచారు.
ఈ కేసు విచారణలో చాలా లోపాలు ఉన్నట్లు కమిషన్ వెల్లడించింది. ఈ కేసుతో లింకు ఉన్న పది మంది పోలీసు ల్ని విచారించాలని కమిటీ అభిప్రాయపడింది. ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన జోలు శివ, జోలు నవీన్, చింతకుంట చెన్నకేశవులు మైనర్లు అని రిపోర్ట్ పేర్కొన్నది. ఎన్‌కౌంటర్ పట్ల ఆనందం వ్యక్తం చేసిన దిశ కుటుంబ సభ్యులు, తెలంగాణ పోలీసుల చర్య పట్ల దేశ మంతటా హర్షాతిరేకాలు వెల్లువెత్తాయి. కానీ మానవ హక్కులు ఉల్లంఘించారని మరికొన్ని వర్గాల గొగ్గోలు పెట్టేయి.
10 మంది పోలీసు అధికారులు ఈ ఎన్‌కౌంటర్ ఘటనలో పాల్గొన్నారని, వీరందరిపై హత్యానేరం కింద కేసు నమోదు చేసి విచారణ జరపాలని కమిషన్ తెలిపింది. పోలీస్ అధికారులు సురేందర్, నరసింహా రెడ్డి, షేక్ లాల్ మదార్, సిరాజుద్దీన్, రవి, వెంకటేశ్వర్లు, అరవింద్ గౌడ్, జానకీ రామ్, బాలు రాథోడ్, శ్రీకాంత్ ఆ జాబితాలో ఉన్నారు. వీరిపై ఐపీసీ 302, సెక్షన్ 201 ప్రకారం కేసు నమోదు చేసి విచారణ జరపాలని కమిషన్ తెలిపింది.
దీన్ని గురించి తీసుకునే చర్యలకు ఎప్పుడు శ్రీకారం చుడతారో ప్రజలకు తెలియాలి. ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందన్నదీ కావాలి. నిజానికి ప్రభుత్వానికి ఇదో పెద్ద తలనొప్పిగా మారుతుందన్న భయంతోటి అనుమానంతోనే మొత్తం రాష్ట్ర ప్రజల దృష్టిని మొన్నటి జూబ్లీహిల్స్ కారు రేప్ కేసువేపు మళ్లించే ప్రయత్నాలు బాగానే చేసేరు. ప్రజలు దీని మీద చర్చించడంలో వున్నందువల్ల గత కేసుల గురించి ఆట్టే పట్టించుకోరులే అనుకోవడమే పెద్ద పొరపాటు.


