TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

దేవధర్ ట్రోఫీ విజేత వెస్ట్ జోన్

Published on: Thu Mar 14, 2013 8:07AM

 

దేశవాళీ దేవధర్ ట్రోఫీ వన్డే క్రికెట్ టోర్నమెంట్ జరుగుతుంది. గౌహతి నెహ్రూ స్టేడియంలో బుధవారం జరిగిన ఫైనల్ మ్యాచ్ లో వెస్ట్ జోన్, నార్త్ జోన్ పై ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించి ట్రోఫీని కైవసంచేసుకుంది. మన రాష్ట్ర ఆటగాడు అంబటి రాయుడు వెస్ట్ జోన్ గెలుపులో ముఖ్యమైన పాత్ర వహించాడు. అంబటి రాయుడు ఈ మ్యాచ్ లో 78 నాటౌట్ గా నిలిచి 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు అందుకున్నాడు. టాస్ గెలిచి వెస్ట్ జోన్ ఫీల్డింగ్ ఎంచుకుంది. నార్త్ జోన్ నిర్ణీత 50 ఓవర్లలో 289 పరుగులు చేసింది. నార్త్ జోన్ ఇన్నింగ్స్ లో ఓపెనర్ ఉన్ముక్త్ చంద్ 88పరుగులు, యువరాజ్ సింగ్ 67 పరుగులు చేశారు. వీరిద్దరూ 120 పరుగుల భాగస్వామ్యాని నెలకొల్పారు. నార్త్ జోన్ ఇన్నింగ్స్ ముగిసిన తరువాత ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్ట్ జోన్ 48.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 293 చేసి విజయం సాధించింది. వెస్ట్ జోన్ ఇన్నింగ్స్ లో కెప్టెన్ పార్థివ్ పటేల్ 58పరుగులు, మన్ ప్రీత్ జునేజా 56 పరుగులు, కేదార్ జాదవ్ 57 పరుగులు, అంబటి రాయుడు 78 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.