ముంబై టెస్ట్: వెస్టిండీస్ 182 ఆలౌట్

 

 

 

భారత్, వెస్టిండిస్ మధ్య గురువారం ప్రారంభమైన రెండవ టెస్ట్ మ్యాచ్‌లో బ్యాటింగ్ చేసిన విండీస్ 55.2 ఓవర్లలో 182 పరుగులకు ఆలౌట్ అయింది. వెస్టిండిస్ ఆటగాళ్లలో పోవెల్ 1 సిక్సర్, 4 ఫోర్లతో 48 పరుగులు కొట్టగా మిగిలిన బ్యాట్స్‌మెన్ తక్కువ పరుగులకే పెవిలియన్ చేరడంతో విండీస్ 200 పరుగులు కూడా చేయకుండానే ఆలౌట్ అయింది. భారత్ బౌలర్లలో ఓజా 5 వికెట్లు, అశ్విన్ 3, కుమార్, షమి చెరో వికెట్ట పడగొట్టారు.