పాకిస్థాన్... 1 పరుగు 4 వికెట్లు

 

ప్రపంచ కప్ క్రికెట్‌లో భాగంగా క్రైస్ట్ చర్చ్‌లో పాకిస్థాన్ - వెస్టిండీస్ మ్యాచ్‌లో పాకిస్థాన్ అతి దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంది. మొన్ననే ఇండియా చేతిలో ఘోరంగా ఓడిపోయిన పాకిస్థాన్‌కి ఇప్పుడు అంతకంటే నీచమైన సిట్యుయేషన్ ఎదురైంది. తాజా మ్యాచ్‌లో వెస్టిండీస్ మొదట బ్యాటింగ్ చేసి 310 పరుగులు చేసింది. 311 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన పాకిస్థాన్ కేవలం ఒక పరుగు చేసి నాలుగు వికెట్లు కోల్పోయింది.. నమ్మ బుద్ధి కావడం లేదా... నిజంగానే కేవలం ఒక్కటంటే ఒక్క పరుగు చేసి నాలుగు వికెట్లు కోల్పోయింది. వెస్టిండీస్ బౌలర్ జెరోమీ టేలర్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే పాక్ రెండు వికెట్లు కోల్పోయింది. పాక్ పరుగుల ఖాతా తెరవకుండానే ఓపెనర్ నాజిర్ జంషెడ్ పెవిలియన్ చేరాడు. ఇదే ఓవర్లో యూనిస్ ఖాన్ కూడా ఔటయ్యాడు. టేలర్ తన మరుసటి ఓవర్లో హారిస్ సొహైల్ను ఔట్ చేశాడు. ఇక విండీస్ బౌలర్ హోల్డర్ ఆ తర్వాతి బంతికి హెహజాద్ను ఔట్ చేశాడు. దీంతో పాక్ ఒక్క పరుగుకే నాలుగు వికెట్లు కోల్పోయింది.