TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పశ్చిమలో 'దేశం'కు గడ్డుకాలం?

Published on: Fri Mar 30, 2012 12:26PM

పశ్చిమగోదావరిజిల్లా ఒక్కప్పుడు తెలుగుదేశంపార్టీకి కంచుకోటగా ఉండేది. తరువాత వివిధ కారణాలతో ఆ పార్టీ జిల్లాలో బాగా బలహీనపడింది. ఈ నేపధ్యంలో ఉప ఎన్నికలు జరుగబోతున్న నర్సాపురం, పోలవరం నియోజకవర్గాల్లో ఎలా గట్టెక్కాలో తెలియక పార్టీ అధినాయకత్వం సతమతమవుతుంది. సర్సాపురం టిక్కెట్ ను డాక్టర్ చినమిల్లికి పెద్దగా సహకరించడం లేదు. ఇక పోలవరం నియోజకవర్గం విషయానికి వస్తే అక్కడ మాజీ ఎమ్మెల్యే పూనెం సింగన్నదొర కుమారుడు వీరవెంకట సత్యమోహన్ ను బరిలోకి దింపాలని పార్టీ నాయకత్వం యోచిస్తోంది. అయితే సింగన్నదొరపై ఇక్కడ కొంత అసంతృప్తి ఉంది. 

 

అందుకే ఆయన తన కుమారుడిని రంగంలోకి దింపారు. ఇక్కడ కు తెలుగుదేశం పార్టీ నేతల మధ్య అనేక పొరపోచ్చాలు వున్నాయి. జిల్లాలో పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాగంటి బాబు, జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి మధ్య కూడా విభేదాలు వున్నాయి. దీంతో వీరిద్దరూ కలిసి పనిచేయలేకపోతున్నారు. ఈ విభేదాలు వచ్చే ఎన్నికల్లో దేశం అభ్యర్ధుల ఫలితాలపై ప్రభావం చూపుతాయని కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.