TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కాంగ్రెస్ కి చింతలపూడి ఎమ్మెల్యే రాజీనామా

Published on: Mon Oct 29, 2012 4:03PM

West Godavari District, Chintalapudi Constituency, Congress   MLA Maddaala Rajeshkumar, Resigned Party and Post, Resignation   Letter, Speaker, Joining YSRCP, Vijayamma,

 

పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే మద్దాల రాజేశ్‌కుమార్ పార్టీకి, పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను స్వీకర్‌కు పంపనున్నట్లు ఆయన తెలిపారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కారణంగానే తాను గెలిచానని రాజేశ్ ఈ సందర్భంగా వ్యాఖ్యనించారు. అనంతరం వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షురాలు విజయలక్ష్మితో సమవేశమై ఆ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తగా కొనసాగుతానని ఆయన తెలిపారు. రాజేశ్‌కుమార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైఎస్‌ఆర్‌సీపీలోకి వలస వెళ్లడం తనకు ముందే తెలుసని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యానారాయణ తెలిపారు. ఇంకా కొంత మంది ఎమ్మెల్యేలు కూడా వలస బాట పడతారని.. వీరంత స్వార్థం కోసం పార్టీకి మోసం చేసి పోతున్నారని ఆయన విమర్శించారు. కేంద్రమంత్రి వర్గంలో అవకాశం రాని సీనియర్ ఎంపీలలో కొందరికి అసంతృప్తి ఉన్న మాట వాస్తవమేనన్నారు.