TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అందని ఆయుర్వేదం?

Published on: Sat Oct 20, 2012 11:10AM

West Godavari District, Ramachadrapuram Assembly, Kajuluru Mandalam, Gollapalem Ayurved Hospital, Constructed, Doctors Unavailable, MLA Tota Trimurthulu Inagurated

 

తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని కాజులూరు మండలం గొల్లపాలెంలో ఆయుర్వేద ఆసుపత్రి నిర్మించారు.  ఆ ఆసుపత్రిలో వైద్యుడు మాత్రం అందుబాటులో లేడు. ఈ ఆసుపత్రిని రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు ప్రారంభించారు. ప్రభుత్వసాయంతో ఆయుష్‌ ఏర్పాటు చేసిన ఈ ఆసుపత్రి గ్రామీణుల దీర్ఘకాలికవ్యాధులకు పరిష్కారం చూపుతుందని ఎమ్మెల్యే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అయితే ఆసుపత్రికి వైద్యుడ్ని మాత్రం మంజూరు చేయలేదు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆయుర్వేదం విషయంలో ప్రభుత్వాధికార్లు నిర్లక్ష్యం చూపుతున్నారని ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నిర్లక్ష్యానికి పరాకాష్టగా వైద్యుల నియామకం మాత్రం ప్రభుత్వం వేగవంతం చేయటం లేదని విమర్శలూ ఎక్కువయ్యాయి. దీనికి నిధుల కేటాయింపులోనూ నిర్లక్ష్యం చూపుతున్నారని సమాచారం.