TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రామచంద్రాపురం 'దేశం'టిక్కెట్ బిసి అభ్యర్థులకే

Published on: Sat Apr 7, 2012 8:19AM

తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం ఉప ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ తరపున పోటీచేసే అవకాశం బిసి అభ్యర్థికే కల్పించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ తెలుగుదేశంపార్టీ టిక్కెట్ కోసం 15 మంది గట్టిగా పోటీపడుతున్నారు. ఈ నియోజకవర్గంలో బిసిలకు గణనీయమైన సంఖ్యలో ఓట్లు ఉన్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ కు చెక్ పెట్టాలంటే బిసి వర్గ అభ్యర్థిని రంగంలోకి దింపాలని పలువురు దేశం సీనియర్ నాయకులు పార్టీ అధిష్టానానికి సలహా ఇస్తున్నారు.

ఈ నియోజకవర్గానికి ఇన్ ఛార్జిగా వ్యవహరించిన బిసి వర్గానికి చెందిన గుత్తుల సూర్యనారాయణబాబును ఇటీవల పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. మళ్ళీ ఇప్పుడు వేరే సామాజికవర్గానికి టిక్కెట్ కేటాయిస్తే తలెత్తే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని బిసి సామాజికవర్గం వైపే మెజారిటీ నాయకులు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. దేశం టిక్కెట్ ను ఆశిస్తున్న వారిలో మాజీ ఎమ్మెల్యే మేడిశెట్టి వెంకటరామారావు, ఆయన కుమారుడు రవికుమార్, జడ్ పి మాజీ వైస్ చైర్మన్ గుత్తుల బులిరాజు, ఆయన సతీమణి మాజీ జడ్ పి టి సి సభ్యురాలు గుత్తుల సత్యాదేవి, మాజీ ఎంపిపి కట్టా సూర్యనారాయణ, మేడిశెట్టి శేషారావు, బొక్కా వెంకట్రావు తదితలురున్నారు.