బిసిల చేతిలోనే రాజకీయ పార్టీల భవిష్యత్తు
Published on: Wed Mar 7, 2012 9:59AM
పశ్చి
మగోదావరి : పశ్చిమగోదావరి జిల్లాలో బిసి ఓటర్ల చేతిలోనే రాజకీయ పార్టీల భవిష్యత్తు ఉంది. ఇటీవల జరిగిన బిసి ఓటర్ల లెక్కింపు సందర్భంగా ఈ విషయం తేటతెల్లమయింది. జిల్లాలోని ఏడు ప్రధాన పట్టణాల్లో బిసి ఓటర్లను నమోదు చేయగా మొత్తం ఓటర్లలో వారు సగటున 41శాతం ఉన్నట్లుగా తేలింది. ఏలూరులో అత్యధికంగా 54శాతం మంది ఓటర్లు ఉండగా, తాడేపల్లిగూడెంలో 30శాతం మంది ఓటర్లు ఉన్నారు. ఈ లెక్కల ప్రకారం జరుగబోయే మున్సిపల్ ఎన్నికల్లో బిసి ఓటర్లే కీలకం కానున్నారు. వారి తీర్పును బట్టే రాజకీయ పార్టీల భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని రాజకీయ పార్టీలు బిసి వర్గాలను ప్రసన్నం చేసుకోవడానికి ఇప్పటినుంచే ప్రయత్నాలు ప్రారంభించాయి.


