TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పన్నులతో విలవిలలాడుతున్న పశ్చిమ పట్టణాలు

Published on: Tue Feb 21, 2012 10:38AM

పశ్చిమ గోదావరి: పశ్చిమ గోదావరి జిల్లాలో పట్టణాలు పన్నుల మోతతో విలవిలలాడుతున్నాయి. గృహ యజమానులపై పన్నుల భారం పెరగడంతో వారు ఇళ్ళ అద్దెలను బాగా పెంచారు. దీనితో ఆ ప్రభావం అద్దేదారులపై కూడా పడింది. రాష్ట్ర ప్రభుత్వం గతంలో పన్నులపై ఉన్న సీలింగ్ ను ఎత్తివేయడంతో జిల్లాలోని అన్ని పట్టణాలలోనూ ఇంటి పన్నులు పెరిగాయి. దీనివల్ల జిల్లా వ్యాప్తంగా పట్టణాల్లో దాదాపు 12 కోట్ల రూపాయల మేర అదనపు పన్నులను ఇంటి యజమానులు భారించావలసిస్ వస్తోంది. అసలు ఆస్తి పన్ను వర్తించని ఆస్తులపై కూడా పన్ను విధించారు. ఈ కారణాలవల్ల జిల్లాలోని పాలకొల్లు, ఏలూరు, భీమవరం, నర్సాపురం, తణుకు, నిడదవోలు, కొవ్వూరు పట్టణాల్లో అద్దెలు అమాంతం పెరిగాయి.