TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఐదు రోజుల్లో పెళ్లి.. యువ వ్యాపారవేత్త ఆత్మహత్య

Published on: Wed Apr 8, 2026 2:15PM

మరో ఐదు రోజుల్లో పెళ్లి... ఇంట్లో అంతా సందడి... పెళ్లి బట్టలు, నగల షాపింగ్ అంటూ హడావుడి... అంతలోనే పెళ్లి కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడన్న వార్త ఆ కుటుంబాన్ని విషాదంలో ముంచేసింది.  ఈ ఘటన హైదరాబాద్ నగరంలో చోటు చేసుకుంది. హైదరాబాద్ గచ్చిబౌలిలో జరిగింది. వివరాలిలా ఉన్నాయి. గచ్చిబౌలి మంగళ అపార్ట్ మెంట్ లో నివాసముంటున్న మెట్ల వెంకట కృష్ణ శ్రీ సాయి అనే యువకుడు వ్యాపారం చేస్తున్నాడు.

ఈనెల 12వ తేదీన వెంకట కృష్ణ డెస్టినేషన్ మ్యారేజ్ జరగనుంది. ఒకవైపు అంగరంగ వైభవంగా వివాహం జరిపించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.  ఇప్పటికే ఈ వివాహ ఏర్పాట్ల కోసం వెంకట కృష్ణ 20 లక్షల రూపాయలు ఖర్చు చేశాడు.  ఆ సమయంలో వెంకటకృష్ణ తన సోదరుడికి ఒక మెసేజ్ పంపాడు. తాను తీవ్ర మానసిక వేదన కు గురి అవుతున్నానని ఆత్మహత్యకు పాల్పడుతున్నాన్నది ఆ మెసేజ్ సారాంశం. అది చూసి షాక్ కు గురైన సోదరుడు వెంటనే వెంకట కృష్ణ ఉంటున్న ఇంటికి వెళ్ళాడు.

 కానీ అప్పటికే వెంకట కృష్ణ రక్తపు మడుగులో పడి ఉన్నాడు... తీవ్ర మానసిక వేదనకు గురైన వెంకటకృష్ణ పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ మింగి అనంతరం కత్తితో గొంతు కోసుకున్నట్లు తెలుస్తోంది. అది చూసిన సోదరుడు వెంటనే వెంకట కృష్ణను హాస్పిటల్కి తరలిం చాడు. హాస్పిటల్ లో చికిత్స పొందుతూ వెంకటకృష్ణ మృతి చెందాడు. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు  గచ్చిబౌలి పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.  వెంకటకృష్ణ ఆత్మహత్య చేసుకోవ డానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మరో ఐదు రోజుల్లో వివాహం చేసుకోబోయే యువ వ్యాపారవేత్త ఆత్మహత్య చేసుకోవడంతో పెళ్లి ఇల్లు శోకసంద్రంలో మునిగిపోయింది.