TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నీళ్ల ట్యాంకుల బారాత్..!

Published on: Sat Jul 23, 2022 4:35PM

పెళ్లి అన‌గానే అంద‌రికీ ఇష్ట‌మైన‌ది బారాత్‌లో స‌ర‌దాలు, డాన్స్‌లు, గోల‌. రెండు కుటుంబాలు ఇష్ట‌ప‌డే ఈ ప్ర‌ద‌ర్శ‌న‌లో వారి మ‌న‌సులు క‌లుస్తాయి, వారి త‌త్వం తెలుస్తుంది. అదో అందం, ఆనందం. కానీ ఆ మ‌ధ్య కొల్హాపూర్‌లో విశాల్ కోలేక‌ర్‌ జంట పెళ్లి బారాత్ మ‌రో విధంగా జ‌రిగింది. ఎవ్వ‌రూ ఊహించ‌ని విధంగా నీళ్ల ట్యాంకుల బారాత్..! మంగ‌ళ‌వారిపేట ప్రాంత‌మంతా అస‌లు నీళ్ల స‌మ‌స్య‌తో నానా ఇబ్బం దులు ప‌డుతూంటే సంబంధిత అధికారులు నిమ్మ‌కునీరెత్తిన‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ట‌! 

పెళ్లి పేరంటాలు స‌రే స‌మాజంలో స‌మ‌స్య‌ల మీద కాస్తంత దృష్టి ఉండాలి. ప్ర‌జ‌ల ఇబ్బందుల‌ను అధికారులు అంత‌గా ప‌ట్టించుకోన‌ప్పుడు ఏదో ఒక సంద‌ర్భంలో వారికి తెలిసేలా చేయ‌డం ఎంతైనా అవ‌స‌రం. కానీ అలా ఎవ‌రూ ఊహించ‌రు. ఎంత‌సేప‌టికి ప్ర‌భుత్వ కార్యాల‌యాల చుట్టూ చ‌క్క‌ర్లు కొట్ట‌డంతోనే స‌మ‌యం వృధా చేసుకుంటూంటారు. ముఖ్యంగా నీళ్ల అవ‌స్థ‌లు ఎదుర్కొనేవారు గ‌ట్టిగా ఎదురుతిర‌గాల్సిందే. అందులోనూ ఈ రోజుల్లో. కానీ వారి కార్యాల‌యాల‌కు వెళ్లి గొడ‌వ‌లు చేయ‌డంవ‌ల్ల ఏమీ జ‌ర‌గ‌దు. పైగా మ‌న కొంప‌కే ఎస‌రు పెడ‌గ‌ల‌రు స‌ద‌రు ప‌నివారు. 

ఇవ‌న్నీ బాగా ఆలోచించే మ‌హారాష్ట్ర కొల్హాపూర్ కుర్రవాడు త‌న పెళ్లి బారాత్‌ను త‌న బంధువుల‌తో కాకుండా కేవ‌లం వాట‌ర్ ట్యాంకుల‌తోనే జ‌రిగేట్టు ప్లాన్ చేశాడు. కార‌ణం పెళ్లి ఆనందాన్ని అందరూ పంచుకుంటున‌పుడు అంద‌రి స‌మ‌స్య‌ను అధికారుల‌కు తెలిసేలా చేయాల‌ని కొత్త ఆలోచ‌న చేశాడు. అంతే పెళ్లి కూతురు, ఆ అమ్మాయి త‌ర‌ఫువారూ అంగీక‌రించేరు. ఎందుకంటే ఇది ఆ వూరి స‌మ‌స్య‌. అధికారుల నిర్ల‌క్ష్యాన్ని తెలియ‌జేయాల‌న్న ఉద్దేశంతో ఈ స‌రికొత్త బారాత్ చేప‌ట్టాడు. 
అన్న‌ట్టు ఈ కుర్రాడి ఆలోచ‌న బాగుంది. ఆమ‌ధ్య నీటి స‌మ‌స్య ప‌రిష్కార క‌ధాంశంతో వ‌చ్చిన సినిమాలో చిరు, హీరో, స్నేహితులు, అనుచ‌రుల‌తో ఏకంగా వాట‌ర్ పైప్స్‌లో రాత్రంతా ఉండి నిర‌స‌న తెలియ‌జేయ‌డం గుర్తుందిగా! అలాంటిదే కాస్తంత వెరైటీ అన్న‌మాట‌. 

ఎనీవే చిరు, కొల్హాపూర్ కుర్రాడు ఇచ్చిన స్పూర్తితో ఇలాంటి వినూత్న నిర‌స‌న‌లు తెలియ‌జేయ‌డం పెద్ద ట్రెండ్‌గామారినా పెద్ద‌గా ఆశ్చ‌ర్య‌ప‌డ‌క్క‌ర్లేదేమో!