TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

భవిష్యత్‌లో... సామాన్యుడికి అందదేమో!

Published on: Mon Oct 8, 2012 7:20AM

Watermelon, Furd University, London, Scientists, Obesity   Problems, Cholestrol Control, Cucumber

గుండెసమస్యలు, అధిక బరువుతో బాధపడుతున్నారా..? ఎన్ని మందులు వాడినా ఫలితం కనిపించడం లేదా?  అయితే మీరు తప్పకుండా పుచ్చకాయ తినాల్సిందే...! ఇదే దో కొత్తగా ప్రారంభమైన విదేశీ కంపెనీ ప్రారంభోత్సవ ప్రకటన అనుకుంటున్నారా? అబ్బే కాదండీ...! ఇది లండన్‌కు చెందిన ప్యూర్డు యూనివర్శిటీ  నిపుణులు హృద్రోగం, స్థూలకాయ సమస్యలను తగ్గించే గుణం పుచ్చకాయలో ఉందని వారు చేసిన అధ్యయనంలో వెల్లడైంది. దేహంలోని  కొవ్వు స్థాయిని  పుచ్చకాయ తగ్గిస్తుందని,  దానివల్ల స్థూలకాయం సమస్య ఉండదని, అలాగే  ఆవేశాన్ని తగ్గించే లక్షణం పుచ్చకాయలో ఉందని దీనివల్ల గుండెపోటును నివారిస్తుందని నిపుణులు తమ అధ్యయనంలో గుర్తించారు. ఇప్పుడు మనవాళ్ళు దీనిపై దృష్టి పెడతారు. ఎందుకంటే మన పూర్వీకులు పసుపులో ఔషధగుణాలున్నాయని.. అవి ముఖాన్ని కాంతివంతం చేయడంలో, సౌందర్యపోషణకు పనికి వస్తుందని ముఖంనిండా పసుపురాసుకునేవారు. అది నేటితరంలోని ఎంతోమంది ఎబ్బెట్టుగా ఉండి అంతా... అబద్ధం..! పేస్ట్‌లుగా తయారుచేసి విదేశాలనుండి దిగుమతి అయిన వాటిని అధికమొత్తం డబ్బులు పోసి కొని వాడటం ప్రారంభించారు.  అలాగే పుచ్చకాయపై పరిశోధనలు ఫలితంగా  ఇప్పుడు పుచ్చకాయ సుమారుగా 30 నుండి దొరుకుతుంటే.. రాబోయే కాలంలో మూడొందలు అయినా ఆశ్చర్యపోనక్కరలేదు...! అంటే పుచ్చకాయ కూడా గ్యాస్‌, విద్యుత్‌లా.. మారుతుందేమో...! బడా బడా వ్యాపారవేత్తలు దీనిపై దృష్టిపెడితే.. భవిష్యత్‌లో ఇది సామాన్యునకు అందకపోయినా ఆశ్చర్యపోనక్కరలేదు. మనదేశంలో చాలామందిలో మనవాళ్లు చెప్పింది అంతా అబద్ధంగా అనిపిస్తుంది... అదే  కొత్తసీసాలో పాతసారాలా... అదే విషయం విదేశాల నుండి వచ్చిందనుకోండి అప్పుడది నమ్ముతారు...! ఇటువంటి వాళ్ళు మారరు.. అంతే!