Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...వేసవిలో వాటర్ ట్యాంక్ లో నీరు వేడిగా ఉన్నాయా? ఇలా చేస్తే చల్లగా ఉంటాయ్..!
posted on: Apr 17, 2025 9:30AM
.webp)
వేసవి వేడి చాలా ఇబ్బందికరమైనది. వేసవి కాలంలో అన్నీ చల్లగా ఉండాలని అనుకుంటాం. ముఖ్యంగా ఇంట్లో కుళాయి ఆన్ చేయగానే వచ్చే నీరు చల్లగా ఉంటే బాగుంటుందని అనుకుంటాం. కానీ వాటర్ ట్యాంకులు మేడ మీద ఉండటంతో ఎండకు ట్యాంక్ లో నీరు చాలా వేడిగా మారుతుంది. కుళాయి నుండి కూడా బాగా వేడిగా ఉన్న నీరే వస్తుంది. బాత్రూమ్ కు వెళ్ళినా, ఇంట్లో సామాన్లు కడుక్కోవాలన్నా, రోజువారి పనుల కోసం వేడిగా ఉన్న నీరు వాడాలి అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలా కాకుండా ఎంత ఎండలో అయినా వాటర్ ట్యాంక్ లో నీరు చల్లగా ఉండాలంటే కొన్ని టిప్స్ పాటించాలి. వీటి వల్ల వాటర్ ట్యాంక్ లో నీరు సాధారణ రోజుల్లో ఉన్నట్టు ఉంటుంది. దీని గురించి తెలుసుకుంటే..
కావలసిన వస్తువులు..
ధర్మకోల్ షీట్స్
సిజర్స్ టేప్
జనపనార సంచులు
ప్లాస్టిక్ తాడు
ఎలా చేయాలంటే..
మొదట వాటర్ ట్యాంక్ వేసవి ఎండలకు దెబ్బతినకుండా ఉండాలన్నా, వాటర్ ట్యాంక్ సురక్షితంగా ఉండాలన్నా ఇంటి పై భాగంలో వాటర్ ట్యాంక్ ఉంచిన చోట ఒక చిన్న షెడ్ ఏర్పాటు చేసుకోవాలి. ఈ షెడ్ కింద వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేసుకోవాలి. ఇది వాటర్ ట్యాంక్ దెబ్బతినకుండా కాపాడుతుంది.
ధర్మకోల్ షీట్స్..
ధర్మకోల్ షీట్స్ పలుచగా ఉన్నవి తీసుకోవాలి. ఈ షీట్స్ ను ట్యాంక్ చుట్టూ టేప్ సహాయంతో ఎక్కడా గ్యాప్ లేకుండా అతికించాలి. ట్యాంక్ మూతకు కూడా దీన్ని అతికించవచ్చు. ధర్మకోల్ షీట్ మంచి ఇన్సులేటర్ గా పనిచేస్తుంది. బయటి ఉష్ణోగ్రతను లోపలికి రాకుండా నిరోధిస్తుంది.
జనపనార సంచులు..
ధర్మకోల్ షీట్స్ ను ట్యాంక్ చుట్టూ అతికించిన తరువాత జనపనార సంచులను ధర్మకోల్ షీట్స్ మీద చుట్టూ కట్టాలి. ఈ సంచులు జారిపోకుండా ప్లాస్టిక్ తాడు సహాయంతో గట్టిగా బిగించాలి. ట్యాంక్ మూతకు కూడా ఇలా చేయవచ్చు. ఇలా చేసిన తరువాత ప్రతి రోజూ ఉదయం ట్యాంక్ ను కాస్త నీటితో తడపాలి. జనపనార తడి కారణంగా ట్యాంక్ లోని నీరు చల్లగా ఉంటాయి. వేసవిలో ట్యాంక్ లో నీరు చాలా వేడిగా ఉంటాయి అనే సమస్య ఎదురుకాదు.
*రూపశ్రీ.


.webp)
.webp)


