TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

వాషింగ్ మెషిన్‌లో పడి కవలల దుర్మరణం

Published on: Sun Feb 26, 2017 11:53AM

న్యూఢిల్లీలో హృదయవిదారక సంఘటన జరిగింది. ఇద్దరు చిన్నారులు వాషింగ్ మెషిన్‌లో పడి దుర్మరణం పాలయ్యారు. దేశ రాజధానిలోని రోహిణి సెక్టార్-1లోని అపార్ట్‌మెంట్‌లో ఓ గృహిణి బట్టలు ఉతికేందుకు వాషింగ్ మెషిన్‌లో నీళ్లు నింపింది..డిటర్జెంట్ పౌడర్ తెచ్చుకునేందుకే బయటకు వెళుతూ ఆడుకుంటున్న ఆమె ఇద్దరు కవల పిల్లలు నిశాంత్, నక్షయ‌లను అక్కడే వదిలి షాపుకు వెళ్లింది. తీరా ఆమె తిరిగొచ్చేసరికి పిల్లలిద్దరూ కనిపించలేదు. ఎంత వెతికినా వారి జాడ కనిపించకపోవడంతో ఇరుగుపొరుగు వారి సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆఫీసు నుంచి పరుగుపరుగున ఇంటికి వచ్చిన ఆమె భర్త కూడా వెతుకుతుండగా చిన్నారులిద్దరూ వాషింగ్ మెషిన్‌లో తేలియాడుతూ కనిపించారు.. వెంటనే వీరిద్దరినీ సమీపంలోని ఆస్పత్రికి తరలించగా..వారు అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు..దీంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు.