ఉగ్రవాదులకు వార్నింగ్.. మీకు కుటుంబాలు ఉన్నాయి...
Published on: Thu Mar 9, 2017 9:55AM

జమ్మూకశ్మీర్ డీజీపీ ఉగ్రవాదులకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. గత శనివారం సాయుధులైన ఉగ్రవాదులు షోపియన్‌లో డీఎస్‌పీ ఇంటిలోకి ప్రవేశించి వస్తువులను ధ్వంసం చేశారు..అనంతరం డీఎస్‌పీ ఉద్యోగానికి రాజీనామా చేయాలని లేదంటే మిగిలిన శాఖలకు చెందిన ఉద్యోగుల వలె ఇంటి దగ్గర కూర్చోవాలని...లేదంటే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరికలు జారీ చేశారు. ఇదే విధంగా మరికొన్ని పోలీసు అధికారుల కుటుంబాలను ఉగ్రవాదులు హెచ్చరించారు. దీనిపై స్పందించిన డీజీపీ కుటుంబాలు అనేవి మాకే కాదు..ఉగ్రవాదులకు ఉంటాయని, తాము తలచుకుంటే చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. పోలీసులకు, ఉగ్రవాదులకు జరుగుతున్న పోరులో కుటుంబాలను తీసుకురావొద్దని పరోక్షంగా హెచ్చరించారు.


