TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జాబ్ మేళాకు పోటెత్తిన నిరుద్యోగులు

Published on: Sat Apr 12, 2025 4:57PM

వరంగల్ వేదికగా శుక్రవారం జరిగిన జాబ్ మేళాకు నిరుద్యోగులు పోటెత్తారు. దాదాపు 23 వేల 238 ఈ జాబ్ మేళాకు హాజరు కాగా వీరిలో దగ్గరదగ్గర 5631 మందికి ఉద్యోగాలు లభించాయి. ఎంపికైన వారికి స్పాట్ లోనే నియామకపత్రాలను అంద జేశారు.

వరంగల్ తూర్పు నియోజకవర్గ పరిధిలోని ఎమ్ కే నాయుడు కన్వెన్షన్ హాల్ లో మంత్రి కొండా సురేఖ చొరవతో ఆ జాబ్ మేళా జరిగింది.  దాదాపు వంద కంపెనీలు ఈ జాబ్ మేళా ద్వారా ఉద్యోగులను ఎంపిక చేసుకున్నాయి. యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా నిర్వహించిన ఈ జాబ్ మేలా విజయవంతమైందని మంత్రి కొండా సురేఖ చెప్పారు.