TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కంగారుపడుతున్న కొండా దంపతులు

Published on: Mon Apr 2, 2012 11:15AM

వరంగల్ జిల్లా పరకాల అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా రంగంలో ఉన్న కొండా సురేఖ ఇటీవల కొంత కలవరానికి గురవుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో టిఆర్ ఎస్, బిజెపిలు తెలంగాణా సెంటిమెంట్ తో గెలిచాయి. పరకాలలో కూడా తెలంగాణా సెంటిమెంట్ పుష్కలంగా వుండటం కొండా సురేఖ, ఆమె భర్తను కంగారు పుట్టిస్తోంది. పరకాలలో కొండా సురేఖకు క్యాడర్ బలం చాలా తక్కువ ఉంది. కేవలం వైయస్సార్ పథకాలు, జగన్ ప్రచారం మీదనే ఆమె గెలుపు ఓటములు ఆధారపడి వున్నాయి. టిడిపి ఇప్పటికే చల్లా ధర్మారెడ్డి పేరును ఖాయం చేసింది.

 

టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఇంకా అభ్యర్ధుల పేర్లను ఖరారు చేయలేదు. కాంగ్రెస్ నుండి గంపవెంకటరమణారెడ్డి భార్య గండ్ర జ్యోతికి అవకాశం కల్పిస్తానని భావిస్తున్నారు. దొంతి మాధవరెడ్డి కూడా టిక్కెట్ కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు. టిఆర్ ఎస్ విషయానికి వస్తే పరకాల నియోజకవర్గ ఇన్ ఛార్జి మొగులూరి భిక్షపతి, పెద్ది సుదర్శన్ రెడ్డి, మాజీ ఎంపి వినోద్ కుమార్ ల పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. టిఆర్ ఎస్ నుంచి వినోద్ కుమార్ బరిలోకి దిగితే కొండా సురేఖకు ఈ ఎన్నికల్లో గట్టి పోటీ ఎదురుకావడం ఖాయం.