TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

స్టేషన్ ఘన్ పూర్ 'మాస్టర్' ఎవరో?

Published on: Sat Feb 18, 2012 3:42PM

వరంగ్ జిల్లా: వరంగ్ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ శాసనసభ ఉప ఎన్నికకు రంగం సిద్ధమైంది. 2009 లో కాంగ్రెస్ నుంచి గెలుపొందిన డాక్టర్ తాటికొండ రాజయ్య ప్రత్యేక తెలంగాణా సాధనలో కాంగ్రెస్ విఫలమైందని ఆరోపిస్తూ 2011 అక్టోబర్ 27న ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేశాడు. అనంతరం టిఆర్ ఎస్ పార్టీలో చేరారు. దీనితో స్టేషన్ ఘన్ పూర్ శాసనసభకు ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇక్కడ కాంగ్రెస్, టి ఆర్ ఎస్, టిడిపిల మధ్య త్రిముఖ పోరు జరుగనుంది. రాజయ్యను తమ పార్టీ అభ్యర్ధిగా టి ఆర్ ఎస్ ఇప్పటికే ప్రకటించింది. టిడిపి నుంచి మాజీ మంత్రి, పొలిట్ బ్యూరో సభ్యుడు కడియం శ్రీహరి పేరు ఖరారైంది. అయితే కాంగ్రెస్ పార్టీనుంచి నేటికీ అభ్యర్ధిని ప్రకటించకపోవడంతో పార్టీ శ్రేణులతో పాటు టిక్కెట్ ఆశిస్తున్నవారిలోనూ ఉత్కంఠ నెలకొంది. మాజీ ఎమ్మెల్యే బోనగిరి ఆరోగ్యం, ఎస్సీ, ఎస్టీ కమీషన్ మాజీ సభ్యుడు రాజారవు ప్రతాప్ తో పాటు పలువురు నియోజక వర్గ నాయకులు టిక్కెట్ పై ఆశలు పెట్టుకున్నారు. తెలంగాణా సాధనే ఏకైక లక్ష్యంగా ముందుకు సాగుతున్న టిఆర్ ఎస్ ఉద్యమమే ఊపిరిగా బరిలో దిగనుంది. కాంగ్రెస్ పార్టీ ఏడు సంవత్సరాలు కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పాటు తెలంగాణా ఇచ్చేది, తెచ్చేది మేమే అన్న నినాదంతో ఎన్నికల గంగంలోకి దిగనుంది. ఇక ప్రధాన ప్రతిపక్ష టిడిపి తొమ్మిదేళ్ళ పాలనలో చేసిన అభివృద్దితోపాటు పటిష్టంగా ఉన్న పార్టీ కేడర్ అండగా ఉప పోరుకు సిద్ధం కానుంది. ప్రతి ఎన్నికలల్లో పరిశీలకుల అంచనాలకు అందని తీర్పునిచ్చే విలక్షణ ఓటర్లున్న స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ ప్రజలు ఎవరిని తమ మాస్టర్ గా ఎన్నుకుంటారో వేచి చూడాల్సిందే.